సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం భరత్ అనే నేను.. పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ మూవీ టీజర్ కు వచ్చిన స్పందన సరిపోతుంది. గంటల వ్యవధిలోనే కోటికి పైగా వ్యూస్ సాధించిన రికార్డు తన ఖాతాలో వేసుకుంది విజన్ ఆఫ్ భరత్. మరో నెల రోజుల్లో మూవీ రిలీజ్ సందర్భంగా.. ఇప్పుడు సినిమా సంగతులు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. 
 

ముఖ్యంగా మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించిన వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నా.. అదిరిపోయే ఫైటింగ్ సీన్స్ ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే చెప్పేశారు. పైగా ఇప్పుడు ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సీజీ వర్క్ కూడా ఉపయోగిస్తున్నారట. అంటే మహేష్ ఫైటింగ్స్ కు కంప్యూటర్ గ్రాఫిక్స్ తోడవుతాయన్న మాట. ఆ పాయింటే అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇలా గ్రాఫిక్స్ పేరు చెప్పి స్పైడర్ ను నానా యాగీ చేయడంతో పాటు ఆలస్యం చేసిన సంగతి తెలిసిందే. పైగా స్పైడర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఉపయోగించిన నాసి రకం గ్రాఫిక్స్.. విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు మళ్లీ భరత్ అనే నేను మూవీలో యాక్షన్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే  ఇంటర్వెల్ బ్లాక్..  ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్.. ఫ్యాన్స్ ని కేరింతలు పెట్టిస్తాయని.. కొరటాల ఆ ఫైట్ సీన్స్ ను అంత ఇంటెన్సిటీతో రూపొందించాడని టాక్ వినిపిస్తోంది.