ఐపిఎల్ 2018 సందట్లో బాలయ్య డైలాగ్‌ ప్రత్యక్షమయింది. 

ఐపిఎల్ 2018 సందట్లో బాలయ్య డైలాగ్‌ ప్రత్యక్షమయింది. వైరల్‌ అయింది. బాలయ్య డైలాగుల గురించే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన డైలాగుల్ని ఆయన తప్ప మరొక చెప్పలేరు. కొన్నయితే ఆయనకు తప్ప నరమానవులెవరికి అర్థం కావు. ఏదయినా సరే, ఇలాంటి డైలాగులతో ఆయనెపుడూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటారు.దటీ జ్ బాలయ్య. ఆయన సినిమా వచ్చిందంటే ఇమిటేట్ చేసేందుకు అభిమానులకు ఒక అరడజన్ డైలాగులు దొరికినట్లే. అయితే ఈ సారి బాలయ్య డైలాగ్ ను ఓ విదేశీ క్రికెటర్ వల్లె వేసి వావ్ అనిపించేశాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌ మన్‌ అలెక్స్‌ హేల్స్‌ బాలయ్య డైలాగ్‌ టకటకా చెప్పి దబిడిదిబిడిలాడించాడు.

View post on Instagram