కొడుకుతో వెళితే అందరు గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారంట...

First Published 10, Mar 2018, 1:19 PM IST
Suna shares funny incident with her son
Highlights
  • క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొన్నటి వరకు సనా చాలా బిజీ
  • అందంలో సనాకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు​
  • హీరోయిన్స్ సిస్టర్ క్యారెక్టర్ అంటే ఈజీగా నమ్మేస్తారు​

సినీ నటి సన తన నట జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలను ఓ షోలో వెల్లడించారు. బుల్లితెరపై తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె వెండితెరకు షిఫ్టై మంచి ప్రస్థానాన్ని కొనసాగించారు.ఆమె చిన్న పాత్ర వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్లిపోతారు. సినిమాల రిజల్ట్ తో వారికి సంబంధం ఉండదు. చేసుకుంటూ వెళ్లడమే.. వయసు పై బడే వరకు కూడా సినిమాలు చేస్తుంటారు. అలాంటి వారిలో సనా ఒకరు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొన్నటి వరకు సనా చాలా బిజీ. అయితే అందంలో సనాకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చూడగానే ఆకట్టుక్కునే నవ్వు ఆమె సొంతం. హీరోయిన్స్ సిస్టర్ క్యారెక్టర్ అంటే ఈజీగా నమ్మేస్తారు. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒక సరదా విషయం గురించి చెప్పుకున్నారు. ఒక రోజు తన కొడుకు అన్వర్ తో సినిమాకు వెళ్ళినపుడు చాలామంది వారినే చూశారట. 

అయితే కొంత మంది అన్వర్ స్నేహితులు వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ను మాకు పరిచయం చేయవా.. అని అడిగేశారట. ఈ విషయాన్ని నవ్వుతూ సరదాగా చెప్పుకుంది సనా. ఇక తన మొదటి సినిమా నిన్నే పెళ్లాడతా అని చెబుతూ.. అప్పట్లో ఓ షోకి యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీ గారు చూసి నాకు అవకాశం ఇచ్చారని సనా తెలిపింది.     

loader