Asianet News TeluguAsianet News Telugu

చరణ్, మహేష్, బన్నీ.. గెలుపెవరిదంటే!

ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ వేసవికి రావాల్సిన పెద్ద సినిమాలన్నీ కూడా విడుదలైనట్లే

summer box office winner is ram charan

ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ వేసవికి రావాల్సిన పెద్ద సినిమాలన్నీ కూడా విడుదలైనట్లే.. ముందుగా రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' అలానే అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాలలో దేనికి గెలుపు కిరీటం దక్కిందో ఓసారి చూద్దాం. 

భారీ అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అల్లు అర్జున్ నటనకు వంక పెట్టలేం కానీ సినిమాను నడిపించిన తీరు సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ బన్నీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సినిమా లాభాలను మాత్రం తీసుకురాలేకపోయింది. ఇక మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రెండు వారాల్లో రూ.88 కోట్ల షేర్ ను మాత్రమే సాధించింది. నా పేరు సూర్య సినిమాకు నెగెటివ్ టాక్ రావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యి వీకెండ్ లో ఓ మోస్తరు వాసూల్లతో రూ.93 కోట్లను దాటింది. ఈ సినిమా 
బయ్యర్లకు నష్టాలు మిగల్చడం ఖాయం. కాకపోతే అవి స్వల్ప స్థాయిలోనే ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు బిజినెస్ పెరిగిపోవడమే దానికి కారణం. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.95 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి ఉండొచ్చు. నిజానికి రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' వసూళ్లను కూడా దాటేసి నాన్-బహుబలి రికార్డ్ ను నెలకొల్పుతుందని అనుకున్నారు కానీ ఆ అంచనాలు ఫలించలేదు. ఇక ఓవర్సీస్ లో కూడా రంగస్థలం 3.5 మిలియన్ మార్క్ ను అందుకుంటే 'భరత్ అనే నేను' మాత్రం 3.35 మిలియన్ డాలర్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ కూడా చేయలేకపోయింది. కాబట్టి ఈ సమ్మర్ బాక్సాఫీస్ విజేత చిట్టిబాబే అని క్లిస్టర్ క్లియర్ గా తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios