కీర్తి రెడ్డితో అందుకే విడాకులు తీసుకున్నానని చెప్పేసిన సుమంత్

First Published 19, Dec 2017, 10:29 AM IST
sumanth reveals his divorce reasons
Highlights
  • మళ్లీ రావాతో సక్సెస్ అందుకున్న సుమంత్
  • తాజాగా తన వ్యక్తిగత జీవితంపై స్పందించిన సుమంత్
  • కీర్తి రెడ్డితో విడాకులపై సుమంత్ వివరణ

తాజాగా ‘మళ్లీ రావా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుమంత్ మొత్తానికి మ‌ళ్లీ ఓ హిట్ అందుకున్నాడు. సుమంత్ వివాహిక జీవితం కాస్త ఇబ్బందుల్లో పడి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సన భార్య కీర్తి రెడ్డితో ఇప్పటికీ ఫ్రెండ్ షిప్ వుందంటున్న సుమంత్... మరి ఆమెతో ఎందుకు విడిపోయాడన్నది మాత్రం చాలాకాలంగా సీక్రెట్ గానే వుంది. అితే తాడాగా సుమంత్ తన మనోగతాన్ని, విడాకులకు కారణాల్ని వివరించే ప్రయత్నం చేశారు. 

 

మళ్లీ రావా సక్సెస్ తో విజ‌యోత్సాహంలో ఉన్న సుమంత్ త‌న తదుపరి చిత్రం కోసం క‌థ‌లు వినే ప‌నిలో ఉన్నారు. అయితే, ఆయ‌న తొలిసారిగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆయ‌న మాజీ స‌తీమ‌ణి, న‌టి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవ‌డం వెనుక గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించారు. 2004లో పెళ్లి చేసుకున్న‌ సుమంత్‌, కీర్తిరెడ్డి ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. అయితే, సుమంత్ ఈ విష‌యంపై మాట్లాడ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డేవారు కాదు.తాజాగా తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతతూ... ఒక‌రినొక‌రు ఇష్డ‌ప‌డే పెళ్లి చేసుకున్నాం. కానీ, పెళ్లి త‌ర్వాత మా అభిప్రాయాలు వేర‌ని అర్థమైంది. అందుకే, ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోయాం. అయితే, కీర్తి ఇప్ప‌టికీ నాకు మంచి ఫ్రెండ్. అప్పుడ‌ప్పుడు ఫోన్ చేసి యోగ‌క్షేమాలు తెలుసుకుంటాను. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి కావ‌డం నాకు సంతోషంగా అనిపించింది. మా తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌న్నుమూసిన త‌ర్వాత ఆమె ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆమెను క‌ల‌వ‌లేదు. అదే చివ‌రిసారి అని సుమంత్ తెలిపారు.

loader