ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది హాట్ టాపిక్ గా మారింది. సందర్భం వచ్చిన ప్రతిసారి తారలు ఈ విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ ఏషియానెట్ సుమన్ తో నిర్వహించిన ఇంటర్వ్యూలో  ఈ విషయంపై మాట్లాడారు. ''ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేయడమనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. పాత్రకి ఎవరు నప్పుతారో చూసుకొని దానికి తగ్గట్లుగా ఆయన నటీనటులను ఎంపిక చేసుకుంటారు. ఒకరిని మరొకరు రిఫర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే సినిమా అనేది కోట్లలో జరిగే వ్యాపారం. నష్టం వస్తే నిర్మాతలకు డబ్బులు ఎవరు తిరిగిస్తారు.

ఈ విషయంపై మాట్లాడుతున్న ఓ అమ్మాయి తెలుగు అమ్మాయిలకే ఛాన్స్ లు ఇవ్వాలి.. బయట అమ్మాయిలను ఎందుకు తీసుకుంటున్నారని కామెంట్స్ చేశారు. అది నాకు సబబుగా అనిపించలేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రొడక్ట్ అవుట్ ఫుట్ అనేది ముఖ్యం. ఈ పాత్రకు వీళ్లయితేనే బాగుంటారని డైరెక్టర్ ఎంపిక చేసుకుంటారు. కొందరు ఫ్రెష్ నెస్ కోసం వేరే భాషకు చెందిన తారలను తీసుకుంటున్నారు. 'మహానటి' సినిమాలో మలయాళీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. మలయాళీ అయినా.. సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఇలా పాత్రకు సెట్ అయ్యే వాళ్లను మాత్రమే తీసుకుంటారు. మాకు ఛాన్స్ లు ఇవ్వడం లేదంటే ఎలా..?'' అని స్పష్టం చేశారు.