తెలుగమ్మాయిలకి ఆ ఫిజిక్ ఉంటే అవకాశాలొస్తాయి.. సుమన్ కామెంట్స్! (వీడియో)

Suman commnets on heroine physique
Highlights

సీనియర్ నటుడు సుమన్ ఏషియానెట్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయాలకు సంబంధించి ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావడం లేదు, అలానే కాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై ఆయన స్పందించారు.

సీనియర్ నటుడు సుమన్ ఏషియానెట్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయాలకు సంబంధించి ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావడం లేదు, అలానే కాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై ఆయన స్పందించారు. 'సినిమా అనేది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడానికి రూపొందిస్తారు. సినిమాల్లో ఐటెం సాంగ్ సంస్కృతి ఎక్కువైంది. ఇంతకముందు కూడా ఐటెం సాంగ్స్ ఉండేవి కానీ వాటి కోసం ప్రత్యేకంగా కొందరు తయారు ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్సే ఐటెం సాంగ్స్ చేసేస్తున్నారు. లేదంటే బి, సి ఆడియన్స్ సినిమా చూడరు. వారు అంత ఖర్చుపెట్టుకొని సినిమా చూడాలంటే అందులో అన్ని ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారు. అలాగని మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేయమని నేను చెప్పడం లేదు. అయితే బాలీవుడ్ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉండడం, వాటిని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుండడంతో మన ఆడియన్స్ కూడా ఆ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే వారిని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ తెలుగు సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నారు. కేవలం ఫిజిక్ ఒక్కటే ఉంటే సరిపోదు. టాలెంట్, అందం కూడా ఉండాలి. అవన్నీ ఉండే తెలుగమ్మాయిలకు తప్పకుండా అవకాశాలు వస్తాయి' అన్నారు.

                                        

 

loader