ఒక యాక్టర్ రాజకీయనాయకుడు కావడం ఆహ్వానించదగ్గ విషయమే.. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం.. పవన్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను.

ఒక యాక్టర్ రాజకీయనాయకుడు కావడం ఆహ్వానించదగ్గ విషయమే.. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం.. పవన్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ రావాల్సిన అవసరం కూడా ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ఆనందంగా ఉంది. లీడర్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఫాలోయింగ్ ఉంది కాబట్టి పవన్‌పై బురద జల్లేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. వ్యక్తిగత విషయాలను తెర పైకి తీసుకురావడం కరెక్ట్ కాదు. నేను జాతకాలు బాగా నమ్ముతాను.. ఆయన జాతకాన్ని బట్టి ఇది సరైన సమయమో కాదో ఒకసారి జాతకం చూపించుకుంటే మంచిది.