మహేష్ తో రివెంజ్ వర్కవుట్ అవుతుందా?

First Published 28, Jun 2018, 4:16 PM IST
sukumar to direct revenge story for mahesh babu
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు సుకుమార్ గతంలో '1నేనొక్కడినే' సినిమా తెరకెక్కించిన 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు సుకుమార్ గతంలో '1నేనొక్కడినే' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సుకుమార్ టేకింగ్ కు ఎవరు వంక పెట్టలేకపోయారు.

అయితే మహేష్ కు హిట్ ఇవ్వాలనే ఆలోచనతో మరోసారి అతడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా 'రంగస్థలం' సినిమాతో సక్సెస్ అందుకున్న సుకుమార్ త్వరలోనే మహేష్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. రంగస్థలం సినిమా కోసం రివెంజ్ బ్యాక్ డ్రాప్ ఎన్నుకున్న సుక్కు మహేష్ కోసం కూడా రివెంజ్ డ్రామాతో కథ రాసుకున్నాడట.

అయితే ఆ రివెంజ్ ప్లాట్ కూడా సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్.. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తరువాత సుకుమార్ సినిమా మొదలవుతుంది. మరి మహేష్ తో రివెంజ్ డ్రామా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
 

loader