రంగస్థలం లెంగ్త్ మాది కాదు, చిరంజీవిది

sukumar reaction on run time
Highlights

రంగస్థలం లెంగ్త్ మాది కాదు, చిరంజీవిది అంటున్నాడు సుకుమార్

 

అర్జున్ రెడ్డి లాంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే లాంగ్ రన్ టైమ్ తో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లాపడ్డాయి. ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత కత్తిరింపులు చేసినా ప్రయోజనం దక్కని సినిమాలు కోకొల్లలు. ఇంత చరిత్ర పెట్టుకొని మరీ రంగస్థలం సినిమాకు దాదాపు 3గంటల నిడివి ఫిక్స్ చేశారు. ఎగ్జాట్ గా చెప్పాలంటే 2గంటల 5​9​నిమిషాల డ్యూరేషన్ ఉంది.

ఈ రోజుల్లో ఇంత సేపు ఓ సినిమాను చూసేంత ఓపిక ప్రేక్షకుడికి లేదు. రెండున్నర గంటల సినిమాల్నే 5-10నిమిషాలు కుదిస్తున్న ఈరోజుల్లో రంగస్థలం సినిమాకు ఏకంగా 2గంటల 50నిమిషాల రన్ టైం ఫిక్స్ చేయడం ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ మేటర్ పై సుకుమార్ రియాక్ట్ అయ్యాడు.

"చిరంజీవి సినిమా చూశారు. చాలా బాగుందన్నారు. లెంగ్త్ కాస్త ఎక్కువుందని చెప్పా. అయినప్పటికీ ఒక్క ఫ్రేమ్ కూడా తీయొద్దన్నారు. రన్ టైం ఎక్కువగా ఉందనే భయం నాక్కూడా ఉంది. కానీ ఎప్పుడైతే చిరంజీవి ఆ నమ్మకం ఇచ్చారో మా అందరికీ ధైర్యం వచ్చేసింది. రన్ టైం ఇక తగ్గించదలుచుకోలేదు." రంగస్థలం నిడివిపై సుకుమార్ రియాక్షన్ ఇది.

సో.. రంగస్థలం లెంగ్త్ మాది కాదు, చిరంజీవిది అంటున్నాడు సుకుమార్. చిరంజీవి ధైర్యం చెప్పడంతో 3గంటల డ్యూరేషన్ తో థియేటర్లలోకి వస్తున్నామని చెబుతున్నాడు. చిరంజీవి నమ్మకం నిజమౌతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

loader