సినిమా ప్రపంచంలో ఒక సీన్ పర్ఫెక్ట్ గా వచ్చిందంటే దర్శకుడి కంటే సంతోషపడే వారు ఆ వరల్డ్ లో ఇంకెవరు ఉండరు. దర్శకుడు ఎంత ఆలోచించి ఒక సీన్ రాసినా కూడా ఆ సీన్ కి నటుడు న్యాయం చేయకుంటే దర్శకుడు ఫెయిల్ అయినట్టే. సాధారణంగా తమిళ్ సినిమాల్లో దర్శకులు వారు అనుకున్న తరహాలో నటుడు నటించే వరకు వదలరు. అందుకే కోలీవుడ్ లో తెరకెక్కే సినిమాలు నటన పరంగా ది బెస్ట్ అంటారు. తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే ఉన్నారు.

కానీ ఒక్కోసారి హీరోలతో అనుకున్న రేంజ్ లో నటనను రాబట్టలేకపోతారు. ఇక అసలు విషయానికి వస్తే.. రంగస్థలం సినిమా కోసం దర్శకుడు సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని సీన్స్ లలో గట్టిగా వాడుకున్నాడట. చరణ్ కూడా సుక్కు అంచనాలకి తగ్గట్టుగా నటనలో సరికొత్త ప్రయత్నాలు చేశాడట. సినిమా దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. కొన్ని సీన్స్ అయిపోతే గుమ్మడికాయ కొట్టేస్తారు. అయితే రీసెంట్ గా ఫైనల్ అవుట్ ఫుట్ ని చూసిన దర్శకుడికి చరణ్ నటనను చూసి నోట్ మాట రాలెదట. కంటతడి పెట్టుకొని ఒక్కసారిగా చరణ్ ని హగ్ చేసుకోవడంతో యూనిట్ మొత్తం షాక్ అయ్యారట.

సుకుమార్ తన లైఫ్ లో ఎప్పుడు ఇంత ఎమోషనల్ కాలేదని ఆయన సన్నిహితులు చెప్పాడం చూస్తుంటే రామ్ చరణ్ తన అసలు టాలెంట్ ని రంగస్థలం లో చూపించేశాడు అని అర్ధమవుతోంది. ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీ హిట్ లో ఒకటిగా నిలవడం పక్కా అని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమాలో ఏక్కువగా బ్రదర్స్ సెంటిమెంట్ ఉంటుందట. 1980 కాలంలో కొనసాగే ఈ కథలో అది పినిశెట్టి బ్రదర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక సమంత పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే.