తరుణ్ భాస్కర్ రూపొందించిన `ఈ నగరానికి ఏమైంది` మూవీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సీక్వెల్‌ని తీసుకొస్తున్నారు. ఇందులో యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటికి ఛాన్స్ దక్కింది.
రీ రిలీజ్‌లో దుమ్మురేపిన `ఈ నగరానికి ఏమైంది` మూవీ
తరుణ్ భాస్కర్ దర్శకుడిగా రూపొందించిన `ఈ నగరానికి ఏమైంది` మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. బడ్డీ కామెడీగా రూపొందిన ఈ మూవీ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2018లో వచ్చిన ఈ మూవీలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను నటించారు. ఈ నలుగురు కుర్రాళ్లు చేసే రచ్చనే ఈ మూవీ. ఇది స్ట్రెయిల్ రిలీజ్ కంటే రీ రిలీజ్ టైమ్‌లో ఎక్కువ వసూళ్లని రాబట్టింది. అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ మూవీకి ఆడియెన్స్ లో ఎంతటి డిమాండ్ ఉందో అర్థమయ్యింది.
`ఈ నగరానికి ఏమైంది` సీక్వెల్ నుంచి సుశాంత్ ఔట్
ఈ క్రమంలో ఇప్పుడు దీనికి సీక్వెల్‌ని తీసుకొస్తున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే ఇందులో నుంచి ఓ నటుడు సుశాంత్ రెడ్డి తప్పుకున్నాడు. ఇటీవల తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో సుశాంత్ రెడ్డి తప్పుకున్నట్టు తెలిపారు. సుశాంత్ వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ లో కొనసాగలేకపోతున్నానని పెట్టిన పోస్ట్ చూసి తన గుండె పగిలినంత పని అయ్యిందన్నారు. కథ చాలా సహజంగా వచ్చిందని, సుశాంత్ లేకపోయినా కార్తీక్ పాత్ర కథలో ఉంటుందని సోషల్ మీడియా ద్వారా దర్శకుడు వెల్లడించారు.
`ఈ నగరానికి ఏమైంది` సీక్వెల్‌లో శ్రీనాథ్ మాగంటికి లక్కీ ఛాన్స్
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రంలోకి కొత్త నటుడు ఎంట్రీ ఇచ్చాడు. `లక్కీ భాస్కర్`, `హిట్`, `యానిమల్` చిత్రాలతో మెప్పించిన శ్రీనాథ్ మాగంటి ఈ చిత్రంలో నటిస్తున్నాడు. కీలక పాత్ర కోసం ఆయన `ఈ నగరానికి ఏమైంది` సీక్వెల్‌లో ఎంపికయ్యాడట. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన కల్ట్ ఫిల్మ్ `ఈ నగరానికి ఏమైంది` సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. నలుగురు స్నేహితుల చుట్టూ నడిచే కథతో ఈ సినిమాని తీశారు తరుణ్ భాస్కర్. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, స్నేహం నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు.
సుశాంత్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి?
`ఈ నగరానికి ఏమైంది 2` స్క్రిప్ట్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాశారు. అందులో శ్రీనాథ్ మాగంటి ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. హీరోల్లో ఆయన కూడా ఒకరు. `ఈ నగరానికి ఏమైంది` సినిమాలో కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్, 'ఈ నగరానికి ఏమైంది 2'లో నటించడం లేదని తరుణ్ భాస్కర్ తెలిపిన విషయం తెలిసిందే. సుశాంత్ లేకపోయినా కార్తీక్ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ రోల్ శ్రీనాథ్ మాగంటి చేస్తున్నారని తెలుస్తుంది. అందులో నిజమెంతా అనేది తెలియాలి. అదే సమయంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


