రంగస్థలం పేరుతో ఒక హై బడ్జెట్ పీరియడ్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు సుకుమార్. ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజీలో ఉన్నాయి. ఈ సినిమా మార్చ్ 30న విడుదల కి సిద్ధంగా ఉండగా మరి సుక్కు తర్వాత సినిమా ఏంటి అనేది ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవిని కలిసి గ్యాంగ్ లీడర్ టైపులో ఉండే ఒక గ్యాంగ్ స్టర్ కథను చెప్పినట్టు విన్నాం. ఇప్పుడేమో అల్లు అర్జున్ సుక్కుతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. బన్నీ - సుకుమార్ స్నేహం ఇప్పటిది కాదు. ఎప్పుడో ఆర్య సినిమాతో మొదలుకొని ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వారిద్దరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా ఆర్య 2 పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వీరు కలిసి సినిమా కూడా చేయలేదు. కానీ బన్నీ అడిగితే సుకుమార్ కాదనే ప్రసక్తే లేదు. కాబట్టి ఇద్దరి కాంబోలో మూడో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్. 

అయితే రంగస్థలం సినిమా రిజల్ట్ పైనే సుక్కు తరువాయి సినిమా ఆధారపడి ఉంటుంది అని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చిరు కూడా రంగస్థలం హిట్ అయితే అప్పుడు ఓకే చెప్దాములే అని ఆలోచిస్తుంటే బన్నీ కూడా రంగస్థలం హిట్ అయితే తనతో ఒక సినిమా చేయమని అడుగుదాం అని అనుకుంటున్నాడు. ఇది ఏమైనా సుకుమార్ మళ్ళీ మెగా ఫ్యామిలీ హీరోతోనే సినిమా చేయబోతున్నాడు అన్నమాట. అదీ సంగతి.