'ఆఫీసర్' ట్రాప్ లో ఎలా చిక్కాడంటే!

'ఆఫీసర్' ట్రాప్ లో ఎలా చిక్కాడంటే!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ అయ్యి చాలా కాలం అయింది.  దీంతో ఆయన సినిమాలు కొనడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. నాగార్జున హీరోగా వర్మ రూపొందించిన 'ఆఫీసర్' సినిమా కొనడానికి కూడా బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. అలాంటిది సినిమా ఆంధ్రా హక్కులన్నీ ఒక బయ్యర్ తీసుకోవడం షాకింగ్ గా అనిపించింది.

ఇప్పుడు సినిమా నష్టాలను మిగాల్చడంతో ఇక తనకు ఆత్మహత్య తప్ప మరొక ఆప్షన్ లేదని అంటున్నాడు. చిన్న బయ్యర్ అయిన ఆయన వర్మ ట్రాప్ లో ఎలా పడ్డాడంటే.. రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం ఆ జిల్లాలో సీనియర్ బయ్యర్ అయినప్పటికీ పెద్ద బయ్యర్ అయితే కాదు. ఆయన దగ్గర 'ఆఫీసర్' సినిమా కోసం ఫైనాన్స్ తీసుకున్నారట. దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలను ఫైనాన్స్ గా ఇచ్చారు. వాటికి సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి.

సినిమా పూర్తయిన తరువాత డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే మొహం చాటేసిన చిత్రబృందం కావాలంటే కోర్టులో కేసు వేసుకో అని సలహా ఇచ్చారట. కోర్టుకు వెళితే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలదని ఇచ్చిన మొత్తానికి ఉభయ గోదావరి జిల్లా హక్కులను తీసుకోవాలని అనుకున్నాడు. అయితే చిత్రబృందం అలా కుదరదని మొత్తం ఆంద్ర హక్కులను తీసుకోవాలని హక్కులను కూడా తక్కువ మొత్తంలో ఇస్తామని చెప్పడంతో రిస్క్ చేసి హక్కులు తీసుకున్నాడు సదరు బయ్యర్. ఇప్పుడు సినిమా ఫ్లాప్ కావడంతో తన పెళ్ళాం, పిల్లలను చూసే దిక్కు లేదని ఇవే తన ఆఖరి మాటలు కావొచ్చని బోరుమంటున్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page