రష్మికి ఎలా ప్రపోజ్ చేశాడో చూడండి!

First Published 25, May 2018, 6:36 PM IST
sudheer love proposal to anchor rashmi gautham
Highlights

ఓ పక్క యాంకర్ గా పలు షోలు నిర్వహిస్తోన్న రష్మి గౌతమ్.. నటిగా కూడా రాణిస్తోంది

ఓ పక్క యాంకర్ గా పలు షోలు నిర్వహిస్తోన్న రష్మి గౌతమ్.. నటిగా కూడా రాణిస్తోంది. చాలా కాలంగా జబర్దస్త్ ఫేమ్ సుదీర్ ఆమెను ప్రేమిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు. కానీ తాజాగా సుదీర్.. రష్మికి ప్రపోజ్ చేసిన సీన్ చూస్తుంటే నిజంగానే ఆమెను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడా..? అనే సందేహాలు కలగక తప్పవు.

వీరిద్దరూ కలిసి చేస్తోన్న షోలో భాగంగా సుదీర్.. రష్మికి తన ప్రేమ గురించి తెలియజెప్పాలి. ఈ క్రమంలో సుదీర్ ప్రపోజ్ చేసిన విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సినిమాలో లవ్ ప్రపోజల్ సీన్స్ కూడా దీని ముందు సరిపోవు. అంత బాగా సుదీర్ జీవించేశాడు. నాలుగేళ్లుగా తనను ఎంతగానో ప్రేమిస్తున్నట్లు చెప్పి ఐ లవ్ యూ రష్మి అని చెప్పేశాడు. ఆ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూడండి!                 

 

                      

loader