ఆమెకేం అర్హత ఉంది.. సూపర్ స్టార్ కూతురిపై నటి ఫైర్..

struggling actor rants about suhana khans vogue india cover on twitter
Highlights

బుల్లితెర నటి అయిన నేను కొన్ని టీవీ షోస్ కూడా చేశాను. అవకాశాల కోసం కష్టపడుతుంటాను. డబ్బులు దాచుకొని ఆడిషన్స్ కు వెళ్లి, అక్కడ నాలుగైదు గంటలు లైన్ లో నిలబడతాను.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఫోటోలు ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై విమర్శలు గుప్పించింది నటి భూమికా చద్దా. అసలు మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించడానికి సుహానాకు ఏం అర్హత ఉందని ప్రశ్నిస్తోంది. సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడుతున్న తనలాంటి వాళ్లకి సుహానా లాంటి వాళ్లను చూస్తుంటే చాలా కోపంగా ఉంటుందని సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.

'బుల్లితెర నటి అయిన నేను కొన్ని టీవీ షోస్ కూడా చేశాను. అవకాశాల కోసం కష్టపడుతుంటాను. డబ్బులు దాచుకొని ఆడిషన్స్ కు వెళ్లి, అక్కడ నాలుగైదు గంటలు లైన్ లో నిలబడతాను. అప్పుడు మీ బట్టలు సరిగ్గా లేవు మరోసారి రండి అని వెనక్కి పంపించేస్తుంటారు. రోజు ఆడిషన్స్ కు వెళుతూ రిజక్ట్ అవుతూ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఎంత బాధ ఉంటుందో స్ట్రగుల్ అయ్యేవారికే తెలుసు. కానీ సుహానా ఖాన్ లాంటి వాళ్లకి ఇలాంటివేమీ ఉండవు.

ఒక్క సినిమాలో కూడా నటించకుండానే ఆమె 'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజీపై వచ్చింది. సూపర్ స్టార్ కూతురిగా ఆమెపై ఫోటోషూట్ చేయడంలో అసలు అర్ధం లేదు. ఇది నా బాధ మాత్రమే' అంటూ వెల్లడించింది. 

loader