పవన్ అభిమానికి తన రెండో పెళ్లి గురించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేణు

First Published 24, Jun 2018, 12:10 PM IST
Strong counter to pawan fan on her second marraige
Highlights

పవన్ అభిమానికి తన రెండో పెళ్లి గురించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేణు

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తాను మరో వివాహానికి సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్న వేళ, రెండో పెళ్లి వద్దని సలహా ఇచ్చిన ఓ అభిమానికి రేణూ దేశాయ్ ఘాటైన సమాధానం ఇచ్చింది. "మేడమ్... మీరు మరో వివాహం చేసుకోవద్దు. అలా చేస్తే, మీకు, బయటివారికి తేడా ఏముంటుంది? అసలు పవన్ కల్యాణ్, మీలాంటి అందమైన భార్యను ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదు" అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన రేణు, "ఇలాంటి క్రేజీ అబ్బాయిలు వారి తల్లులు, అక్క చెల్లెళ్లతో ఎలా ప్రవర్తిస్తుంటారో? వారి మానసిక ఆరోగ్యం గురించి చింతిస్తున్నాను" అని వ్యాఖ్యానించింది. ఇక మరో అభిమాని స్పందిస్తూ, "మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయి. నా దేవుడికి ఎలాంటి సమస్యా రాకూడదు. ఏం చేసినా ఆలోచించి చేయండి" అని వ్యాఖ్యానించగా, "క్రేజీ" అని రేణు కామెంట్ పెట్టింది. ఇక పలువురు ఆమె వివాహానికి మద్దతిస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే, తనకు మద్దతిస్తున్న అబ్బాయిలకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉందని పేర్కొంది. వారి తల్లిదండ్రులు వారిని చాలా చక్కగా పెంచారని కితాబిచ్చింది.

loader