తన లుక్ ను మార్చడానికి ఇష్టపడని మహేష్ బాబు తొలిసారి దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో గడ్డం, మీసాలతో కనిపించనున్నారు. ఇటీవల మహేష్ లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ 
అయ్యాయి. అయితే అసలు సినిమాకు ఈ గడ్డానికి లింక్ ఏంటని ఆరా తీయగా, ఈ సినిమాలో మహేష్ అరగంట సేపు స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు.

కాలేజ్ లో అతడి లుక్ గడ్డంతో ఉంటుందట. ఇక మిగిలిన సినిమా మొత్తం అతడు మహేష్ బాబు ఎప్పటిలానే కనిపించబోతున్నాడని సమాచారం. మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్ట్ 9)న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్ చేయనున్నారు. ఇక రేపు జరగబోయే 'సమ్మోహనం' సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి మహేష్ హాజరు కానున్నారు. సో అభిమానులు అతడిని క్లియర్ గా చూసే ఛాన్స్ లభించినట్లే.

ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే.. ఈ నెల 10 నుండి మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ డెహ్రాడూన్ లో పర్మిషన్ దొరకకపోవడంతో మరొక వారం రోజుల పాటు షూటింగ్ డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.