15 ఏళ్ల పిల్లాడి చర్యతో స్టార్ హీరోయిన్ షాక్!

First Published 21, May 2018, 1:02 PM IST
star heroine reveals being eve teased by 15 years old boy
Highlights

అందంతో పాటు తన మంచి వ్యక్తిత్వంతో అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ 

అందంతో పాటు తన మంచి వ్యక్తిత్వంతో అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ తార సుస్మితాసేన్ రీసెంట్ గా ముంబైలో జరిగిన మేక్ యువర్ సిటీ సేఫ్ అనే కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను పంచుకుంది. ఆరు నెలల క్రితం తనకు ఎదురైన ఒక షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. ఓ అవార్డు ఫంక్షన్ కోసం ఒక చోటుకి వెళ్ళగా అక్కడ సుస్మితాను వెనుక నుండి ఎవరో వ్యక్తి పట్టుకొని మిస్ బిహేవ్ చేశాడట.

తనను పట్టించుకోలేదని అతడు అనుకున్నాడని కానీ వెనక నుండి అతని చేతిని పట్టుకొని లాగి చూడగానే షాక్ అయిందట. ఎందుకంటే అతడికి మహా అయితే పదిహేనేళ్ల వయసు ఉంటుందని అతడిని పట్టుకొని నిలదీశానని అన్నారు. మొదట ఆ పిల్లాడు తప్పు ఒప్పుకోలేదని... ఆ తరువాత అంగీకరించి ఇంకెప్పుడూ ఇలా చేయనని మాటిచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.

తనపై చర్యలు తీసుకుంటే అతడి కెరీర్ దెబ్బ తింటుందని వదిలేసినట్లు చెప్పారు కానీ ఇలాంటి వారిని వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదని ఆమె అన్నారు. 

loader