సీనియర్ హీరోతో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. చీవాట్లు పెట్టిన హీరోయిన్ తల్లి

star heroine love affair with senior hero
Highlights

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ హీరోయిన్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ పాలబుగ్గల సుందరి ఇప్పుడు ఓ హిట్ సినిమా కోసం పరితపిస్తోంది

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ హీరోయిన్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ పాలబుగ్గల సుందరి ఇప్పుడు ఓ హిట్ సినిమా కోసం పరితపిస్తోంది. ఈ ఏడాదిలో ఆమె నటించిన సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తన తదుపరి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఈ బ్యూటీ ఓ సీనియర్ హీరో కమ్  డైరెక్టర్ తో సన్నిహితంగా ఉంటోందని టాక్.

గతంలో ఈ నటుడు ఓ స్టార్ హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి వరకు తీసుకెళ్లాడు. కానీ అప్పటికే అతడికి భార్యా,పిల్లలు ఉండడంతో లీగల్ రెండో పెళ్లి వర్కవుట్ కాలేదు. తన కుటుంబానికి దూరంగా ఉంటూ.. సినిమాల్లో బిజీ అయిపోయిన ఈ నటుడు ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ సాగించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. ఆ సమయంలోనే వీరి పరిచయం మరింత బలపడిందని చెబుతున్నారు.

ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి తెరపై కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి మధ్య నడుస్తోన్న ఎఫైర్ సంగతి తెలుసుకున్న హీరోయిన్ తల్లి ఆమెను వారిచినట్లు తెలుస్తోంది. స్నేహం వరకు ఓకే అంతకుమించి హద్దులు దాటితే మాత్రం ఊరుకునేది లేదంటూ ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చిందట. అతడితో ప్రొఫెషనల్ గానే వ్యవహరించాలని సూచించిందట. ఈ కారణంగానే ఆమెకు తొందరగా పెళ్లి కూడా జరిపించాలని ఆలోచన చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. 

loader