ఎల్లో మీడియాపై పవన్ కళ్యాణ్ తిరుగుబాటు ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఆ చానెళ్లను బహిష్కరించాలని పవన్ పిలుపును కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలోని మహిళలను టీవీ5 యాంకర్ అసభ్య పదజాలంతో దూషించినా ...ఇండస్ట్రీని కించపరిచేలా కార్యక్రమాలు ప్రసారం చేసినా ఇండస్ట్రీ తరఫు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంపై పవన్ గుర్రుగా ఉన్నారు. ఇండస్ట్రీపై మీడియా వైఖరి....దానిపై భవిష్యత్ కార్యచరణ గురించి చర్చించేందుకు  ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పవన్ లేవనెత్తిన అంశాలు....రాజకీయంగా కూడా ముడిపడి ఉండడంతో చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది

 పవన్ - ఎన్టీఆర్ - మహేష్ లతో పాటు నాని - శర్వానంద్ తదితర హీరోలందరూ ఈ సమావేశానికి హాజరవుతారని వినికిడి. ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం ఉండకపోవచ్చని...ఇది పూర్తిగా ఇండస్ట్రీ అంతర్గత సమావేశంగా జరగబోతోందని టాక్.