'ఆఫీసర్' సినిమా చేసినందుకు బాధ పడుతున్న నాగార్జున?

star hero upset after watching his own film
Highlights

నాగార్జున బాధకు కారణం

సీనియర్ స్టార్ హీరో నాగార్జున ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమాలో నటించాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా ల్యాబ్ లో ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయాడట.

తను నటించిన సినిమా తనకే నక్చకపోవడంతో చాలా బాధ పడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని డైరెక్టర్ కు నేరుగా చెప్పినా.. వర్మ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండానే సినిమా విడుదల చేయడానికి సిద్దపడుతున్నాడని తెలుస్తోంది. గతంలో నాగార్జునతో 'శివ' వంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కావడంతో వర్మను ఏం అనలేక సైలెంట్ గా ఉండిపోయాడట నాగ్.

రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు కూడా ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమా ఒప్పుకొని తప్పు చేశానా..? అని నాగ్ ఇప్పుడు సన్నిహితుల వద్ద వాపోతున్నాడని సమాచారం. నిజానికి వర్మతో సినిమా చేయలనుకున్నప్పుడే నాగ్ ను చాలా మంది వార్న్ చేశారట. వర్మ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు సినిమా చేయడం కరెక్ట్ కాదని కొందరు చెప్పినా అతడి మీద నమ్మకంతో నాగార్జున ముందడుగు వేశారు. మరి ఆడియన్స్ కు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!

loader