టాలీవుడ్ లో అతడొక పెద్ద స్టార్.. కానీ రాజకీయాలకు మాత్రం అతడు చాలా దూరం. పొరపాటున పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినా.. న్యూట్రల్ గా వ్యవహరిస్తుంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్ పై రాజకీయాల ప్రభావం ఉంది.

రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని ఈ హీరో తెలంగాణా ఎలెక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడట. టీఆర్ఎస్ పార్టీతో అతడికి మంచి సంబంధాలు ఉండడంతో ఆ పార్టీ విజయం సాధించాలని తెగ ఉబలాటపడుతున్నాడట. అతడితో పాటు తన కుటుంబం కూడా అదే కోరుకుంటోందని తెలుస్తోంది. 

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ప్రజాకూటమి కూడా ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. దీంతో సదరు స్టార్ హీరో ఆందోళన చెందుతున్నాడట.

ఎలెక్షన్స్ క్యాంపెయిన్ ని దగ్గరగా ఉండి గమనిస్తున్నట్లు తెలుస్తోంది. డిసంబర్ 11న రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు ఈ స్టార్ హీరోకి టెన్షన్ తప్పదు. మరి తను కోరుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా..? లేక మరో పార్టీనా అనేది చూడాల్సివుంది!  

తెలంగాణా ఎన్నికలు: స్టార్ హీరోలు ఎక్కడ..?