ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం మొత్తం ఎన్నికల ఫీవర్ తో ఉంది. ఎక్కడ చూసిన ఎన్నికల ప్రస్తావనే.. మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగుస్తుండడంతో ఎన్నికల వేడి మరింత రాజుకునేలా చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన తరువాత రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు ఆ వేడి కొనసాగుతూనే ఉంటుంది. అయితే తెలంగాణా ఎన్నికలకు సంబంధించిన స్టార్ హీరోలు సైలెంట్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఏ పార్టీకి తమ మద్దతు తెలపడం లేదు. తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ పాలన అధ్బుతంగా ఉందని, కేటీఆర్ పనితీరు బాగుందని తెగ పొగిడేసిన  తారలు ఇప్పుడు మాత్రం అసలు మాట్లాడడం లేదు. రామ్ చరణ్,  మహేష్ బాబు, రానా, నాగార్జున, సమంత, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది తమ సినిమా ఫంక్షన్స్ కోసం కేటీఆర్ తో ప్రచారం చేయించారు.

చాలా మంది హీరోలకి కేటీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ వీళ్లలో ఏ ఒక్కరూ కూడా ఎలెక్షన్స్ కి సంబంధించి ఒక్క ట్వీట్ కానీ కామెంట్ కానీ చేయలేదు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎలాగో వారితో తమ బంధాన్ని కంటిన్యూ చేస్తారు మన సెలబ్రిటీలు. ఒకవేళ పరిస్థితులు మారుతాయేమోనని గమ్మునుండిపోయారు. అందుకే ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం లేదు.

ఒకవేళ తాము ప్రచారం చేసిన పార్టీ అధికారంలోకి రాకపోతే తమకే ఇబ్బందని భావించి సైలెంట్ గా ఉండిపోయారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం కోసం ఏ హీరోని వాడుకోలేదు. కానీ స్వచ్చందంగా హీరోలు ముందుకొస్తారని కేటీఆర్ భావించాడట. అలా జరగకపోవడం ఆయన కాస్త నిరుత్సాహానికి గురైనట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.