స్టార్ డైరెక్టర్ ట్వీట్ తో నెటిజన్ల ఆగ్రహం!

star director faces anger from netizens in twitter
Highlights

తమిళంలోనే కాకుండా తన చిత్రాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు 

తమిళంలోనే కాకుండా తన చిత్రాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శంకర్. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో దీనిపై శంకర్ 'వాటే మ్యాచ్' అంటూ ప్రశంసించాడు.

అయితే తూత్తుకూడిలో వేదాంత కంపెనీకు చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నాడు ఈ ఆందోళన కాస్త హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. అందులో 11 మంది మరణించారు.

ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. దర్శకుడు శంకర్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడని నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు క్రికెట్ అంత ముఖ్యమా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ పోస్ట్ తొలగించిన శంకర్ బుధవారం నాడు తూత్తుకూడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. 
 

loader