కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన రాజమౌళి బాహుబలి దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి ఇప్పటికీ హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న బాహుబలి బాహుబలి రెండు పార్ట్ లు కలిపి 2వేల కోట్లు అందుకుంటుందని అంచనా
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులన్నీ చెరిపేసి బాహుబలి2 వెయ్యికోట్ల రూపాయలు వసూలు చేసేందుకు చేరువైంది.ఇప్పటిదాకా రూ.745కోట్లతో దేశంలో హైయస్ట్ గ్రాసర్ గా నిలిచిన పీకే రికార్డులు బద్దలు కొట్టి తొలి వారంలోనే అంటే అతి తక్కువ సమయంలోనే బాహుబలి గత రికార్డులన్నీ చెరిపేసింది.
బాహుబలి పార్ట్ వన్ చిత్రాన్ని రూ.180 కోట్లతో నిర్మించగా, బాహుబలి2 సినిమాను రూ.450 కోట్లతో తెరకెక్కించారు. మొత్తం 620 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన ఈ మూవీకి పార్ట్ వన్ బాహుబలి సినిమా రూ.650 కోట్ల వసూళ్లను సంపాదించింది. ఇప్పుడు బాహుబలి ది కన్ క్లూజన్ రిలీజై భారీగా వసూల్లు సాధిస్తోంది. విడుదలకు ముందే... తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషల్లో రూ.438 కోట్లు శాటిలైట్, ఇతర హక్కుల కింద ఆదాయం వచ్చింది. కలెక్షన్స్ కూడా 1000 కోట్లు దాటి మరింత భారీగా వసూలయ్యేలా ఇప్పటికీ చిత్రం హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.
అయితే ఇంతటి అద్భుత దృశ్య కావ్యాన్ని తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి దర్శకుడు రాజమౌళికి ఎంత పారితోషికం వస్తోందన్నది మాత్రం స్టన్నింగ్ అనిపిస్తుంది. వచ్చిన లాభాల్లో... రాజమౌళి భారీ వాటానే రెమ్యూనరేషన్ గా అందుకోనున్నాడు. ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2 సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. సంచలన విజయం సాధించిన బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా బాహుబలి హిందీ వెర్షన్ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ చిత్రం తెరకెక్కించినందుకు రాజమౌళి లాభాల్లో మూడో వంతు వాటాను పారితోషికంగా తీసుకోనున్నాడని సమాచారం. అంటే వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేస్తే రూ.333కోట్ల పైచిలుకు వాటా రాజమౌళిదే అన్నమాట. అది ప్రస్థుతం రాజమౌళి స్టేటస్. ప్రస్థుతం ట్రెండ్ చూస్తే మాత్రం రెండు పార్ట్ లు కలిపి 2000కోట్ల రూపాయలు వసూలు సాధిస్తుందని అంచనా. సాహో బాహుబలి.
