Asianet News TeluguAsianet News Telugu

ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి..మరెన్నో ప్రశ్నలు వదిలేసిన జక్కన్న

  • బాహుబలి పార్ట్ వన్ లో మిగిలిన కొన్ని ప్రశ్నలు
  • బాహుబలి2లో కూడా సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు
  • సుదీప్ ను మరచిపోయిన రాజమౌళి
  • తమన్నా నేపథ్యం గురించి ఎక్కడా ప్రస్తావించని జక్కన్న
ss rajamouli left many questions answering why kattappa killed bahubali

రెండేళ్లుగా బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులను వేధిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అని. అయితే నిరీక్షణ ముగిసింది.  ఈ ప్రశ్నకు బాహుబలి2లో సమాధానం ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. అయితే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి పార్ట్ 2ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయి భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. రెండో భాగంలోనూ భల్లాలదేవుడి కొడుకు ప్రస్థావన ఉన్నా భార్యను మాత్రం చూపించలేదు.

 

తొలిభాగంలో ఏ సాయం కావాలన్న ఈ మిత్రుడన్నాడంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ రెండో భాగంలో కనిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. క్లైమాక్స్ లో మహిష్మతి మీద దండెత్తడానికి శివుడికి సైనికబలం పెద్దగా లేకపోయినా అస్లాం ఖాన్ సాయం మాత్రం తీసుకోలేదు.

 

దేవసేనను విడిపించడానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన అంవతిక నేపథ్యం, కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. సినిమా నిడివి పెరిగిపోవటంతో కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేశారో ఏమో కానీ... సోషల్ మీడియాకు మాత్రం బాహుబలి రూపకర్త రాజమౌలి మాంచి టాపిక్ వదిలాడు.

Follow Us:
Download App:
  • android
  • ios