Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళికి కులగజ్జి పట్టిందా.. ఈ విమర్శలు దేనికి?

  • నేనే రాజు నేనే మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ రాజమౌళి ట్వీట్
  • రాజమౌళి ట్వీట్ పై సోషల్ మీడియాలో తెగ విమర్శలు
  • రాజమౌళి సామాజిక కోణంలోనే కొన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడని విమర్శలు
ss rajamouli facing cast bias allegations over nene raju nene mantri promotion

ఒక్క సినిమా... ఒకే ఒక్క సినిమా.. బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకధీరుడు జక్కన్న రాజమౌళిపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కమెంట్స్పై తెగ రచ్చ జరుగుతోంది. ఇంతకీ రాజమౌళి పై ఇంతగా కొందరికి కోపం రావడానికి కారణం ఏంటి.

 

నిన్న విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను చూసిన రాజమౌళి ఆసినిమా పై విపరీతంగా ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు ఇదే కొందరికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవల విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ‘ఫిదా’ సినిమాను ప్రశంసించని రాజమౌళి... పనికట్టుకుని ప్రత్యేకంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను ప్రశంసిస్తూ ప్రమోట్ చేయడం వెనుక రాజమౌళికి సంబంధించిన తన సామాజిక వర్గ కోణం ఉందంటూ రాజమౌళి పై సోషల్ మీడియాలో.. కొందరు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

 

బాహుబలితో క్రేజీ దర్శకుడిగా మారిన రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించినా దాని రీచ్ ఓ రేంజ్ లో వుంటోంది. దీంతో రాజమౌళి తనకు నచ్చిన, తనతో సాన్నిహిత్యం వున్న దర్శకుల, నిర్మాతల, హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. తప్పులేదు. కానీ రాజమౌళి ఈమధ్య ప్రశంసలు కురిపిస్తున్న సినిమాలలో చాలామటుకు రాజమౌళి సామాజిక వర్గానికి చెందిన వాళ్ల సినిమాలే ఉన్నాయంటూ.. ‘రెండురెళ్ళు ఆరు’, ‘పటేల్ సార్’ లాంటి సినిమాలను ఉదాహరణగా చూపెడుతున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

 

అయితే రాజమౌళి తనకు నచ్చిన ఒక సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తే... దాంట్లోనూ తప్పులు వెతుకుతున్న విమర్శకులు రాజమౌళి కెరియర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన ‘మగధీర’ ‘బాహుబలి’ లాంటి భారీ ప్రాజెక్టులను రాజమౌళి తన సామాజిక వర్గ హీరోలతో తీయలేదు కదా అని అడిగితే ఏం చెప్తారో.. అసలు ఆ సినిమాలు వేరే సామాజిక వర్గాలకు చెందిన హీరోలతో తీసిన విషయాన్ని మరిచిపోతునన్నారనిపిస్తుంది.  అంతేకాదు... రాజమౌళి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ లాంటి తన సామాజిక వర్గానికి సంబంధం లేని హీరోల సినిమాలను కూడా ప్రశంసించిన సందర్భాలున్నాయి. 

మరి అలాంటప్పుడు రాజమౌళికి కులాన్ని ఆపాదించడమంటే అదు కులగజ్జికి పరాకాష్ట అవుతుందే తప్ప మరోటి కాదని చెపప్పక తప్పదు. రాజమౌళి తెలుగు జాతి బిడ్డ. అందరివాడు. ఆ స్థాయిలో వుండి అలా ప్రవర్తించాల్సిన అవసరం రాజమౌళికి లేదని విమర్శకులు గుర్తించాలని జక్కన్న అభిమానులు స్పష్టం చేస్తున్నారు..

Follow Us:
Download App:
  • android
  • ios