బోయ్ ఫ్రెండ్ తో తెగ హంగామా చేస్తోన్న శృతీ హాసన్ ఇటాలియన్ సిటిజన్ మైఖేల్ కార్స్ లీ తో శృతీ చక్కర్లు రాగ్ దేశ్ స్పెషల్ షోకు ప్రియునితో హాజరై అటెన్షన్ క్రియేట్ చేసిన శృతి

విశ్వనటుడు కమల్ హాసన్ తన సహనటి సారికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకి శృతిహాసన్, అక్షర హాసన్ అనే కూతుళ్లు పుట్టారు. కమల్ ఇద్దరు కూతుళ్లు శృతి, అక్షరలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే శృతిహాసన్ తమిళ, హిందీ, తెలుగు భాషల్లో బిజీ నటిగా కొనసాగుతోంది. మొదటి నుంచి కాస్త దూకుడు స్వభావం కలిగిన శృతి.. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడుతుంది.

ఆ మధ్య పెళ్లి గురించి కూడా కొన్ని కాంట్రవర్సల్ కమెంట్స్ చేసింది. అబ్బాయి నచ్చాలేగాని పిల్లలు కనడానికి పెళ్లే అవసరమా అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన శృతి.. ప్రేమ విషయానికి వస్తే.. తాను ఇప్పటి వరకు ఎంతో మందిని ప్రేమించానని అందులో ఎవరూ తనకు నచ్చలేదని అంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు మైఖేల్ కొర్సలే అనే ఇటలీ కుర్రాడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని అమ్మడి ఎవ్వారం చూస్తే తెలిసిపోతోంది.

తాజాగా తిగ్ మన్షు దులియా ద‌ర్శ‌క‌త్వంలో కునాల్ క‌పూర్, మోహిత్ మ‌ర్వా, మృదుల, అమిత్ స‌ద్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం రాగ్ దేష్ గ్రాండ్ గా విడుద‌లైంది. ఈ చిత్రం సెల‌బ్రిటీల కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్ షో వేశారు. ఈ షోకి త‌న బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కొర్సలే తో క‌లిసి వచ్చిన శృతి హాసన్ మీడియాను స్పెషల్ గా ఎట్రాక్ట్ చేసింది. దీంతో అందరూ ఈ జంటపైనే ఫోకస్ పెట్టారు.

లండన్ లో ఉంటున్న‌ ఇటాలియ‌న్ బాయ్ మైఖేల్ కొర్సలే బుధవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగగా , అత‌డిని రిసీవ్ చేసుకోవడానికి శృతి ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. మైఖేల్ కారులోకి ఎక్క‌గానే ఎగ్జైట్ మెంట్ తో అత‌డి మీద ఎగిరి అమాంతం దూకేసి గట్టిగా హగ్ చేసుకున్న శృతి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.