MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Dhandha Review: ప్రస్తుతం మైక్రో డ్రామాల ట్రెండ్‌ ఊపందుకుంటోంది. అందులో భాగంగా తాజాగా ఛాయ్‌ షార్ట్స్ నుంచి `దందా` అనే మైక్రో డ్రామా వచ్చింది. ఇది ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 02 2026, 09:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దందా రివ్యూ
Image Credit : Asianet News

దందా రివ్యూ

సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తున్న రోజులివి. ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇవి సినిమాని దెబ్బకొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు థియేటర్లకి, సినిమాకి మరో దెబ్బ రాబోతుంది. అదే మైక్రో డ్రామాస్‌(షార్ట్ స్టోరీస్‌). చిన్న చిన్న ఎపిసోడ్స్ లో ఇంట్రెస్టింగ్‌ స్టోరీని చెబుతూ, ఎంగేజ్‌ చేస్తున్నాయి. క్రమంగా ఇవి పుంజుకుంటున్నాయి. భవిష్యత్‌ అంతా వీటిదే అనేలా ఈ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా `దందా` అనే మైక్రో డ్రామా రాబోతుంది. ఛాయ్‌ షాట్స్ యాప్‌లో ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో పాపులర్‌ యూట్యూబర్‌ దొర సాయి తేజ హీరోగా నటించగా, అక్షర నల్ల, ప్రసన్న, కిరణ్‌ కుమార్‌ కామ్తం, సూరికే చాప్లిన్‌, విక్రమ్‌ దేవాకి ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్‌ కుమార్‌ కథ అందించగా, ఆదిత్య దేవులపల్లి దర్శకత్వం వహించారు. ఛాయ్‌ షాట్స్ ప్రొడక్షన్‌లో రూపొందింది. మరి ఈ మైక్రో డ్రామా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దందా మైక్రో డ్రామా కథ ఏంటంటే
Image Credit : Asianet News

దందా మైక్రో డ్రామా కథ ఏంటంటే

ఇది ఒక సాధారణ స్టూడెంట్‌ అసాధారణ జర్నీని చూపిస్తుంది. ఇందులో యూట్యూబర్‌ దొరసాయి తేజ అరవింద్‌ పాత్రలో నటించాడు. ఆయన బిటెక్‌ స్టూడెంట్‌. డబ్బులు బాగా సంపాదించాలని, రాజకీయాల్లో రాణించాలని కలలు కంటుంటాడు. దీంతో కాలేజీకి వెళ్లకుండా డార్క్ సైబర్‌ క్రైమ్‌ పై ఫోకస్‌ పెడతాడు. ఈజీ మనీ కోసం తప్పులు చేస్తుంటాడు. ఆ దిశగా తన తెలివిని ఉపయోగిస్తుంటాడు. చిన్న చిన్న ఆన్‌లైన్‌ మోసాలతో తన జర్నీని ప్రారంభిస్తాడు. ఫిషింగ్‌ స్కామ్‌లు, కాల్‌ సెంటర్లు, బ్లాక్‌ మెయిల్‌, గ్యాంగ్‌ స్టర్స్ వ్యవహారాలు, చివరికి పాలిటిక్స్ వరకు వెళ్తాడు. డిజిటల్‌ క్రైమ్‌ నెట్‌ వర్క్ కి శాసించే స్థాయికి ఎదుగుతాడు. మరి ఈ జర్నీ వెనుక ఆయన ఎలాంటి స్ట్రగుల్‌ ఫేస్‌ చేశాడు, తనకు ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి? మరి తను అనుకున్న స్థాయికి చేరుకున్నాడా? ఈ క్రమంలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయనేది కథ.

Related Articles

Related image1
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Related image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
33
దందా విశ్లేషణ
Image Credit : Asianet News

దందా విశ్లేషణ

మైక్రో డ్రామాలకు సంబంధించిన ఎపిసోడ్లు చాలా సింపుల్‌గా  రెండు మూడు నిమిషాల నిడివితో ఉంటున్నాయి. ఒకటి చూస్తే, మరోదానిపై ఆసక్తి పెరుగుతుంది. ఇలా ఈ `దందా` దాదాపు 64 నిమిషాలు నిడివితో ఉంది. చూస్తుండగానే అయిపోయింది. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగింది. రెండున్నర నిమిషాల ఎపిసోడ్స్ తో మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ డ్రామాను అందించడంలో దర్శకుడు వంద శాతం సక్సెస్ అయ్యాడు. యుట్యూబర్‌ సెన్సేషన‌‌ దొర సాయి తేజ నటుడిగా తానేంటో నిరూపించిన డ్రామా ఇది. అతను అదరగొట్టాడు. విజయం కోసం ఎంతటి అన్యాయానికైనా తెగించే ఒక రా అండ్ రఫ్ 'యాంటీ-హీరో'గా జీవించేశాడు.  చూస్తున్నంత సేపు సాయి తేజ పాత్ర `బిజినెస్ మేన్` సినిమా మహేష్ బాబు సూర్య పాత్రని గుర్తు చేస్తుంది.  నటుడిగా దొర సాయి తేజ రీ-ఇన్వెన్షన్ ఈ షోకి బిగ్గెస్ట్ అసెట్. కళ్లలోనే చల్లటి క్రూరత్వం, గెలుపు కోసం తపించే ఆకలితో అద్భుతమైన నటన కనబరిచాడు. ఒక క్యాలిక్యులేటెడ్, యాంటీ-హీరోగా అతడు చూపించిన పరిణతి బాగుంది. అతనికి సోలో హీరోగా టాలీవుడ్‌లో మంచి భవిష్యత్‌ ఉందని చెప్పొచ్చు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి మేకింగ్ లో తన బెస్ట్ ఇచ్చాడు. చిన్న ఎపిసోడ్లతో కంప్లీట్ క్రైమ్ డ్రామాను నడిపించడం కత్తిమీద సాము. కానీ ఆ రిస్క్ ని అత్యంత ఎఫెక్టివ్‌గా చేసి చూపించింది `దందా` టీమ్. కంటెంట్ ని ఎక్కడా అనవసరంగా లాగకుండా, ప్రతి సీన్ ని ఒక పాయింట్ తో ఎండ్ చేయడం దర్శకుడి రచనా ప్రతిభకి నిదర్శనం. హిందీ డైలాగ్‌లు మాత్రం అదిరిపోయాయి.  ప్రతి ఎపిసోడ్ ని ముగించిన తీరు బాగుంది. ప్రసన్న కుమార్‌, అక్షర వంటి ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ దీనికి తోడయ్యింది. దీనికితోడు అశ్విన్‌ లెనిన్‌ విజువల్స్, మైండ్ లో నిలిచిపోయే సౌండ్ ట్రాక్.. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. మెక్సికన్, టర్కిష్ ఇన్ స్ట్రుమెంట్స్ తో రిషి అందించిన మ్యూజిక్ తెలుగులో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ సౌండ్ ట్రాక్స్ లో ఒకటి. ఇలా జగదీష్‌ గౌడ్‌ షార్ప్ ఎడిటింగ్‌ కూడా ఒక అసెట్‌ అని చెప్పొచ్చు.  

ఫైనల్  : కేవలం ఒక షో కాదు.. తెలుగు డిజిటల్ స్పేస్ లో ఒక రా అండ్ రస్టిక్ విప్లవం. డోంట్ మిస్ ఇట్. సరదాగా ఎంజాయ్‌ చేసే షార్ట్ స్టోరీ అవుతుంది.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image3
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Related Stories
Recommended image1
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved