ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో శ్రీవళ్లి శ్రీవళ్లి చిత్రం ప్రమోషన్ లో ప్రభాస్ ,రామ్ చరణ్ రాజమౌలితో బాహుబలి అందుకున్న ప్రభాస్, మగధీర అందుకున్న చరణ్ రాజమౌళి కోసం విజయేంద్ర ప్రసాద్ మూవీని ప్రమోట్ చేస్తున్న స్టార్స్

బాహుబలవి చిత్రంతో దేశవ్యాప్తంగా వున్న సినిమా ప్రేమికులను తనవైపు ఆకర్షించాడు రాజమౌౌళి. దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన బాహుబలి రూపశిల్పి జక్కన్న తరువాతి చిత్రంపై మాత్రం రకరకాల ఊహాగానాలు కొనసాగుతునే వున్నాయి. రాజమౌళి తదుపరి సినిమాలో హీరో ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో నెలా నెలన్నరలో ఫ్రీ అయిపోయేలా ఉన్నాడు. అందుకే అతడితోనే జక్కన్న సినిమా చేయొచ్చేమో అన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 



ఇలాంటి తరుణంలో రాజమౌళి, చరణ్ ఒకరికొకరు సహకారం అందించుకుంటుండటం కూడా ఈ చర్చకు మరింత ఊపునిస్తోంది. చరణ్ నిర్మాణంలో చిరంజీవి కథానాయకుడి తెరకెక్కబోయే ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్ లోగోను రాజమౌళే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు చరణ్ తన వంతుగా రాజమౌళికి సాయం చేయబోతున్నాడు. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీవల్లీ’ సినిమాను ప్రమోట్ చేయడానికి చరణ్ ముందుకొచ్చాడు. అనేక వాయిదాల తర్వాత సెప్టెంబరు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రి రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. 


దీనికి రామ్ చరణే ముఖ్య అతిథి కావడం విశేషం. ఈ పరిణామం రాజమౌళి-చరణ్ కాంబోలో సినిమా వస్తుందన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే రాజమౌళి.. ప్రభాస్ ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. జక్కన్న ‘శ్రీవల్లి’కి వాయిస్ ఓవర్ ఇవ్వగా.. ప్రభాస్ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ బైట్ ఇచ్చాడు. ఇప్పుడు చరణ్ వచ్చి ‘శ్రీవల్లీ’ గురించి ఏం మాట్లాడతాడో.. అలా శ్రీవళ్లి సినిమాకు మాత్రం యమా క్రేజ్ తీసుకొస్తున్నారు.