నా వెనుక ఆయనున్నారు, అవసరమైతే ఆయన దగ్గరికెళ్తా-శ్రీ రెడ్డి

First Published 30, Mar 2018, 7:16 PM IST
srireddy sensational comments on director maruthi
Highlights
మారుతీ నీకు టైమ్ మూడింది అంటూ శ్రీరెడ్డి వార్నింగ్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన విషయాలు బైటపెడడుతూ గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నటి శ్రీ రెడ్డి  తన సోషల్ మీడియా పేజీల్లో రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు సంబంధించిన ఫోటోలు బైటపెట్టి బండారం బట్టబయలు చేసిన శ్రీ రెడ్డి మరింత మంది గుట్టు విప్పుతానంటూ.. శ్రీ రెడ్డి లీక్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

 

అయితే ఓ పక్క టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అణచివేతకు ప్రభుత్వ జోక్యం అవసరం అంటూ డిమాండ్ చేస్తున్న శ్రీ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలను బాగానే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం... తెలంగాణ సర్కారునే నమ్ముకున్నానంటూ శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టింది. తాజాగా శ్రీ రెడ్డి తెలంగాణ సర్కారులో కీ లీడర్ అయిన మంత్రి కేటీఆర్ పై మరో సంచలన ట్వీట్ చేసింది. తనకు కేటీఆర్ అంటే ఎంతో ఇష్టమని, అతను ఒప్పుకుంటే క్యాండిల్ లైట్ డిన్నర్ ఇవ్వటానికి రెడీ అని అంటోంది శ్రీ రెడ్డి.

 

అంతే కాదు టాలీవుడ్ దర్శకుడు మారుతిని ఉద్దేశించి తన ఫేస్ బుక్ లో... సంచలన కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. మారుతీ మారుతీ టైమొచ్చిందమ్మా మారుతి. పేరు గొప్ప వూరు దిబ్బ. నీ బీపులు చూసే నేను కూడా బీపు నేర్చుకున్నా.. అమ్మాయిలు పెట్టే శాపాలకి ఈపాటికే నాశనం అయిపోవాలి. ఎందుకవలేదు చెప్మా.. నన్ను ఎవరైనా.. బెదిరించాలని ట్రై చేస్తే.. కేసీఆర్ వున్నారు. నాకు ఫుల్ సపోర్ట్. నా ఫోన్స్ లో రికార్డింగ్ ఆప్షన్ వుంది. పోలీసులకు కూడా నా భద్రత కోసం చెప్పి వుంచాను. నా ఫ్రెండ్ ను ఫుల్ చీట్ చేశాడు. మైండ్ ఇట్. అంటూ.. దర్శకున్ని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టింది.

 

అవసరమైతే కేసీఆర్ దగ్గరికి వెళ్తానని, తన వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ వున్నాడని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చారు.

loader