వారిపై శ్రీరెడ్డి పోలీస్ కేసు!

First Published 14, May 2018, 12:45 PM IST
srireddy files complaint against 28 members
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మితిమీరిపోయిందంటూ దాన్ని అరికట్టడానికి ఉద్యమం చేస్తున్నానని

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మితిమీరిపోయిందంటూ దాన్ని అరికట్టడానికి ఉద్యమం చేస్తున్నానని చెప్పుకుంటున్న నటి శ్రీరెడ్డి తాజాగా మరికొందరిపై పోలీస్ కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. శ్రీరెడ్డిపై గతంలో విరుచుకుపడ్డ జీవితారాజశేఖర్, బాబు గోగినేని అలానే పలువురు సినీ ఆర్టిస్టులపై తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.

దాదాపు 28 మందిపై ఆమె కేసు పెట్టినట్లు సమాచారం. వారిపై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని ఏసీపీ అశోక్ చక్రవర్తికి తన వినతిపత్రం అందించింది. ఈ పత్రంలో పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తనపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గ్రూప్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరోపక్క సోషల్ మీడియాలో శ్రీరెడ్డి.. సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం మాత్రం ఇంకా ఆపలేదు. తమపని చేయనివ్వకుండా పోలీసుల్ని శ్రీరెడ్డి అడ్డుకుందని ఆమెపై కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 

loader