ఆయన డబ్బు ఇచ్చి నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నారు : శ్రీరెడ్డి

Srireddy comments on suresh babu
Highlights

ఆయన డబ్బు ఇచ్చి  నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నారు

కొన్ని రోజుల క్రితం వరకు శ్రీరెడ్డి ఎలాంటి విషయాలు చెబుతుంది, ఏ ఫోటోలు విడుదల చేస్తుంది అని కాచుకు కూర్చున్న కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. సోషల్ మీడియా వేదికగా దగ్గుబాటి అభిరామ్ తో తాను కలసి ఉన్న సంచనల ఫోటోలు విడుదల చేసినా కూడా మీడియాలో ఎలాంటి హడావిడి లేదు. అదే పవన్ కళ్యాణ్ ఓ వర్గం మీడియాపై చిరుచుకు పడనంతవరకు శ్రీరెడ్డి ఇష్యూని ఆయా మీడియా సంస్థలు డిబేట్ లతో హోరెత్తించాయి. కొందరు ఎర్రిపుష్పాలు యూట్యూబ్ ఛానల్స్ మైంటైన్ చేస్తూ తనపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాయని శ్రీరెడ్డి ఆరోపించింది. సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వారే ఇలాంటి పనులు చేయిస్తున్నారని శ్రీరెడ్డి అంటోంది.

ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత సురేష్ బాబుని సూరి అంకుల్ అంటూ పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఆయనే మీడియాని మొత్తం కొనేసి తన పోరాటాన్ని అన్ని వైపుల నుంచి అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నట్లు శ్రీరెడ్డి చెబుతోంది. యూట్యూబ్ ఛానల్స్ కు డబ్బు ఇచ్చి నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నారని పేర్కొంది. కొందరు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డిస్ లైకులు, వల్గర్ కామెంట్స్ చేసేలా చేస్తున్నది కూడా ఇండస్ట్రీలో ఉన్నా పెద్దవారే అనేది శ్రీరెడ్డి ఆరోపణ. చివరకు మా అసోసియేషన్ ని కూడా కంట్రోల్ చేస్తున్నారని, తనకు కార్డ్ ఇవ్వడం లేదని తెలిపింది.
ఇండస్ట్రీ లోని బడా నిర్మాతలని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. నా తుది శ్వాస వరకు వదిలిపెట్టను. నేను మరణించినా మరో శ్రీరెడ్డి పుడుతుందని వ్యాఖ్యానించింది.

loader