తెలుగులో కాస్టింగ్ కౌచ్ వివాదంలో టాలీవుడ్ పరువు తీసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఇక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదని చెన్నైకి బయలుదేరింది. అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది.

రాఘవ లారెన్స్, శ్రీకాంత్, సుందర్ సి వంటి తారలు ఆమెను మోసం చేసినట్లుగా ఆరోపణలు చేసింది. అక్కడ ఇంటర్వ్యూలలో కూడా అసభ్యపదజాలంతో సదరు నటులపై విరుచుకుపడింది. అయితే ఇండస్ట్రీలో ఉన్న అందరూ నిన్నే మోసం చేశారా..? అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంపై స్పందించిన శ్రీరెడ్డి తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.

నిజానికి ఈ విషయంలో తన లిస్ట్ చాలా చిన్నదాని కొందరు టాప్ హీరోయిన్ల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న కొందరు తారల పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ వారు గనుక నోరు విప్పితే ఆ లిస్ట్ ఎంత పెద్దదో అర్ధమవుతుందని, నిజాలు తెలిస్తే చస్తారంటూ చెప్పుకొచ్చింది.