టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు మెగాఫ్యామిలీ

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు మెగాఫ్యామిలీలో ఒకరు తనకు బాగా క్లోజ్ అంటూ వార్తల్లో నిలిచింది. 'మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. అతను చెప్పాడు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు జరిగిన అవకతవకలు బాబోయ్.. అ సంఘటనలు తెలిస్తే ప్రతి ఒక్కరూ వామ్మో అంటారు.. ఆ టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తా' అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది.

దీనిపై స్పందించిన నెటిజన్లు.. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు చేసే పోరాటం గురించి వదిలేసి.. వేరే విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు.. ప్రతి విషయంలో వేలు పెడితే నీ పోరాటం చులకన అయిపోతుంది. రాజకీయాల్లోకి రావాలని ఏమైనా అనుకుంటున్నావా..? అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు.