కొద్ది రోజులుగా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుసినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్లను నిర్మాతలు, దర్శకులు హీరోలు అవకాశాల పేరుతో వాడుకోవడం.. వాళ్ల కమిట్మెంట్‌కి లొంగకపోతే హీరోయిన్‌గా అవకాశాలు లేకుండా చేయడం లాంటి విమర్శలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.గత రెండు వారాలుగా శ్రీరెడ్డి చేస్తున్న హాంగామా అంత ఇంత కాదు. తాజాగా ఒక ఇంటర్య్వూలో యాంకర్ మీకు ఎవరితో డేట్ కి వెళ్లాలని ఉందా.. అని అడిగిన ప్రశ్నకు.. వై నాట్ నాకు బన్ని అంటే చాలా ఇష్టం మా ఇద్దరి మెంటాలిటి ఒకేలా ఉంటది. అతనితో డేట్ కైతే నేను ఎప్పుడైనా రెడీ అని సమాధానం ఇచ్చింది.