టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల తన ఫామ్ ని పూర్తిగా కోల్పోయాడు. వైట్ల పేరు చెబితేనే హీరోలు పారిపోతున్న సమయంలో రవితేజ డేరింగ్ గా స్టెప్ తీసుకొని శ్రీనువైట్లతో సినిమా చేయడానికి అంగీకరించాడు. 

దానికి మైత్రి మూవీస్ వంటి తాప బ్యానర్ యాడ్ అయింది. దీంతో సినిమాపై బజ్ పెరిగింది. అయితే సినిమా టీజర్, ట్రైలర్ మాత్రం రొటీన్ గానే కనిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాపై శ్రీనువైట్ల చాలా నమ్మకంతో ఉన్నాడు. ఎంతగా అంటే ఈ సినిమాను బాలీవుడ్ కి తీసుకువెళ్లాలని అతడి ప్లాన్. 

ఈ విషయాన్ని వైట్ల స్వయంగా వెల్లడించాడు. ''ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. హిట్ అయితే గనుక హిందీలో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నాను. గతంలో ఢీ, దూకుడు వంటి సినిమాల్ని బాలీవుడ్ లో తీయమని ఆఫర్లు వచ్చాయి కానీ కుదరలేదు. ఈసారి మాత్రం అలాంటి ఛాన్స్ వదులుకోను. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా హిందీ హక్కులు నా దగ్గర ఉంచుకున్నాను.

తెలుగులో ఆడితే మాత్రం బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను తీస్తాను'' అంటూ స్పష్టం చేశాడు. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది కూడా చదవండి.. 

ఏంటి శ్రీను వైట్ల అవి కూడా చేసారా..? ఇండస్ట్రీ షాక్