కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన దర్శకులు జంధ్యాల, ఇవివి సత్యనారాయణ,రేలంగి నరసింహరావు తర్వాత ఈ తరంలో నిలిచిన  దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీ టైమింగ్ ఆయన చేసే సినిమాలు కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూంటారు. అది పెద్ద హీరో సినిమా కావచ్చు..సీరియస్ సినిమా కావచ్చు కామెడీని మిస్ కారు. అయితే ఇప్పుడు  ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ కోసం తన కామెడీ టైమింగ్ కు తోడుగా మరో రెండు విభాగాల్లో తన ప్రతిభను చూపారని సమాచారం. ఆ విషయం విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.  ఇంతకీ ఏమిటా విభాగాలు అంటే...

రవితేజ  హీరో గా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఇలియానా  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నవంబరు 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ ఇప్పుడు చెప్పబోయో విషయాలు రివీల్ చేసారు. 

అవేమిటంటే... ఈ సినిమాకు ఆయన ఈ సినిమాలో రెండు పాటలకు  కొరియోగ్రఫీ అంటే  డాన్స్ డిజైన్ చేసారు. అలాగే.. ఒక ఫైట్ ఎపిసోడ్ తప్ప మిగతావి ఆయనే డిజైన్ చేసారు. అయితే అమెరికాలో షూటింగ్  సమయంలో  ఇక్కడ నుంచి టీమ్ ను తీసుకువెళ్లటం ఇబ్బంది అయ్యి...కొన్ని ప్రత్యేక పరిస్దితిల్లో ఆయన ఇలా చేసారని సమాచారం. ఏదైమైనా కొరియోగ్రాఫర్స్, డాన్స్ మాస్టర్స్, యాక్షన్ డైరక్టర్స్, ఫైట్ మాస్టర్స్ చేసే పని ఓ దర్శకుడు చేయటం అంటే మాటలు కాదు. ఈ విషయంలో శ్రీను వైట్లను మెచ్చుకోవాల్సిందే ఏమంటారు.

ఈ చిత్రం పూర్తిగా సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతుండగా రవితేజ డిఫరెంట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.