Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. తల్లి మీద పడిన మచ్చను చెరిపేయాలని తపన పడుతున్న ఒక కూతురి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో పెళ్లయ్యాక చదవడం కుదరదు అనుకున్నది సాధించలేను అంటాడు శీను. నీ జీవితంలో చారుని సాధించడమే ఎక్కువ ఉంటుంది పద్మ. నా మనసు అర్థం చేసుకోవా అని శీను అడిగితే నేను నీ మనసుని అర్థం చేసుకుంటున్నాను కానీ నువ్వే చారు మనిషిని అర్థం చేసుకోవట్లేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు చారు తల్లిదండ్రులు వచ్చి కాశీ ప్రసాదం అంటూ స్వీట్ పంచుతారు.

అప్పుడే వచ్చిన శీనుతో రా బాబు నీకు ఒక గుడ్ న్యూస్ అంటాడు చారు తండ్రి. ఏంటి పెళ్లి ఆపేస్తున్నారా అని అడుగుతాడు శీను. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ముహుర్తాలు ఎప్పుడు పెడతారు అనబోయి అలా అనేసాడు అంటూ మాట మార్చేస్తుంది పద్మ. మేము మా అల్లుడికి కారు గిఫ్ట్ గా ఇద్దాము అనుకున్నాము. అదేదో ఇప్పుడే ఇచ్చేస్తాము అంటారు చారు తల్లిదండ్రులు.

ఆనందంతో పొంగిపోతుంది పద్మ. మీ అల్లుడికి ఏమి ఇచ్చుకుంటారో మీ ఇష్టం అంటుంది. ఎందుకైనా మంచిది మా ఆయనని ఒక మాట అడిగి ఇవ్వండి అంటుంది జానకి. వాళ్ల అల్లుడికి వాళ్లు ఇచ్చుకుంటానంటే వాడు మాత్రం ఏమంటాడు అంటూ జానకి మాటని తోసిపుచ్చేస్తుంది ఆమె అత్తగారు. మరోవైపు మోడరన్ డ్రెస్సులు వద్దు లంగా వాణి ముద్దు అంటూ పోస్టర్లు ఉంటాయి కాలేజీలో.

వాటిని చూసిన ఆధ్య వాళ్లు నవ్వుకుంటారు ఇది గుడా, కాలేజా అనుకుంటారు. వాటిని చించేద్దాము అని ఆధ్య పట్టుకుంటే ఆమె చేతిలోంచి రామలక్ష్మి ఆ పోస్టర్ని లాక్కుంటుంది. అప్పుడే వచ్చిన హాకీ కోచ్ అది చూసి కామ్ గా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఎప్పుడూ రుస రుసలాడే మనిషి ఇలా కామ్ గా వెళ్ళిపోయారు అంటుంది రామలక్ష్మి.

అతను మంచివారే, హంబుల్  పర్సన్ నువ్వే అర్థం చేసుకోలేకపోయావు అంటుంది ఆధ్య. మరోవైపు హాకీ బట్టల్లో వచ్చిన రామలక్ష్మి కోచ్ డిఫెన్స్ ఆడమంటున్నారు అంటూ మొఖం దిగులుగా పెట్టుకుంటుంది. నువ్వు ఆడగలవు అంటూ ఆమెని ఎంకరేజ్ చేస్తుంది ఆధ్య. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత డిఫెన్స్ ఆడటానికి ఇబ్బంది పడుతున్న రామలక్ష్మిని  నేను చెప్పినట్లు ఆడితేనే మీరందరూ మంచి ప్లేయర్ అవుతారు అంటాడు కోచ్.

హాకీ ఆడుతున్న రామలక్ష్మిని బయటినుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఆధ్య. అంతలోనే అక్కడికి వచ్చిన  శీను నేను క్యాంటీన్ దగ్గర ఉంటాను నువ్వు వచ్చేయి అంటూ ఆధ్యకి సైగల ద్వారా చెప్తాడు. అక్కడి నుంచి కామ్ గా వెళ్ళిపోతుంది ఆధ్య. సడన్ గా ఆధ్య కనిపించకపోయేసరికి కాన్సన్ట్రేట్ గా ఆడలేకపోతుంది రామలక్ష్మి. కోచ్ నీవల్లే గేమ్ స్పాయిల్ అయింది అంటూ మందలిస్తాడు.

రామలక్ష్మి కి హాకీ మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంది ఎప్పుడు తన వల్లే గేమ్ డిస్టర్బ్ అవుతుంది అంటుంది ఒక ప్లేయర్. గేమ్ అంటే నీ ఇస్టానికి ఆడటం కాదు ఆట మీద ప్రాణం పెట్టి ఆడాలి అంటూ గట్టిగా చివాట్లు పెడతాడు కోచ్. ఎందుకు ప్రతిసారి కోచ్ చేత తిట్లు తింటావు ఆద్య లేకపోతే ఆడలేవా అంటూ మందలిస్తుంది ఛాయ. మరోవైపు శీను ని కలిసిన ఆధ్య ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.

నీతో కలిసి బయటికి వెళ్లాలని వచ్చాను అంటాడు శీను. ఎందుకు ఇంత అర్జెంటుగా బయటకి అంటుంది ఆధ్య. అలా సినిమాకి గాని షికార్ కి గాని వెళ్దాము అంటాడు శీను. ఇప్పుడు వద్దు అర్థం చేసుకో అంటుంది ఆధ్య. వస్తే ఏమవుతుందో అని భయంతో రాను అంటున్నావు నేను కూడా వెళ్ళను అంటాడు శీను.ఇద్దరూ కాసేపు పోట్లాడుకున్న తర్వాత నేను కాలేజీ టెర్రస్ మీదకు వెళ్లి ఐ లవ్ యు అని చెప్తాను తర్వాత నీ ఇష్టం అంటాడు శీను.

భయపడిన ఆధ్య అతనితో బయటికి వెళ్తుంది. బైక్ మీద వెళ్తున్న ఆధ్య, శీను ని బండి ఆగమని కిందకి దిగిపోతుంది నువ్వు కారణం లేకుండా స్పీడ్ బ్రేకులు వేస్తున్నావు నేను రాను నువ్వు వెళ్ళిపో అంటుంది. ఆమెని బ్రతిమాలి బండిమీద కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాడు శీను. మరోవైపు కారులో వస్తుంటారు చారు, ఆమె తల్లిదండ్రులు.

ఇది సెకండ్ హ్యాండ్ కారు అని తెలిస్తే అల్లుడు ఏమంటాడో అంటాడు చారు తండ్రి. ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తారు అంటుంది  చారు తల్లి. మనం అంత బంగారం ఇచ్చినా బావ ఆధ్యనే ప్రేమిస్తున్నాడు అలాంటిది సెకండ్ హ్యాండ్ కారు అంటే ఎగిరి కొడతాడేమో అంటుంది చారు. ముందు మీరు కారు గుర్తు ఇవ్వండి శీను కాకపోయినా వాళ్ళ అమ్మయినా వల్లో పడుతుంది అంటుంది చారు తల్లి. చారు వాళ్ళు, శీను వాళ్ళు అనుకోకుండా ఒక దగ్గరే ఆగుతారు.

చారుని చూసిన ఆధ్య కారు వెనుక వెళ్లి దాక్కుకుంటుంది. శీను ని చూసిన చారు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంటికి రా నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళటం లేదు నా బైక్ పాడైపోయింది బాగు చేయించుకుని వస్తాను అంటాడు శీను. అయితే నేను నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేయ్ అంటూ వెళ్ళిపోతుంది చారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.