'శ్రీనివాస కళ్యాణం' స్పెషల్ షో.. టాక్ ఏంటంటే..?

srinivasa kalyanam movie special show talk
Highlights

 'లై', 'ఛల్ మోహనరంగ' సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి కలిగింది నితిన్ కి. ఇప్పుడు స్పెషల్ షోకి వస్తోన్న టాక్ తనను ఆనందంలో ముంచెత్తుతోందని తెలుస్తోంది. 'శతమానంభవతి' సినిమాను డైరెక్ట్ చేసిన సతీష్ వేగ్నేశ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు.

హీరో నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ అప్పుడే బయటకి వచ్చేసింది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు తన సన్నిహితులతో పాటు డిస్ట్రిబ్యూటర్ లకు స్పెషల్ గా ఈ సినిమాను వేసి చూపించారు. ఈ స్పెషల్ షో చూసిన వారు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ దిల్ రాజుకి శుభాకాంక్షలు చెబుతున్నారట.

ఫ్యామిలీ డ్రామాతో కూడిన ఈ సినిమా చక్కటి ఎమోషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుందని, సంగీతం సినిమా స్థాయిని పెంచిందని అంటున్నారు. పైగా 'బొమ్మరిల్లు' సినిమా విడుదలైన ఆగస్టు 9 సెంటిమెంట్ తో ఈ సినిమాను కూడా విడుదల చేస్తుండడంతో ఆ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. 'లై', 'ఛల్ మోహనరంగ' సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి కలిగింది నితిన్ కి.

ఇప్పుడు స్పెషల్ షోకి వస్తోన్న టాక్ తనను ఆనందంలో ముంచెత్తుతోందని తెలుస్తోంది. 'శతమానంభవతి' సినిమాను డైరెక్ట్ చేసిన సతీష్ వేగ్నేశ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయని అంటున్నారు. అయినప్పటికీ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ కథ అద్భుతంగా తెరకెక్కించారని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో సినిమా పరిస్థితి ఏంటో తేలనుంది!   

loader