`మా` ఎన్నికల్లో, మా ఓటింగ్‌లో, `మా`లో చిచ్చులు పెడుతుంది నరేషేనా. తాజాగా శ్రీకాంత్, సమీర్, ప్రభాకర్ ఆయనపై విమర్శలు గుప్పించారు. ఆయన ఉంటే ఏ పనులు జరగవని ఆరోపించారు. మంచు విష్ణుకి ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు.
`మా` ఎన్నికలు అనంతర పరిణామాలు నరేష్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాయి. మంచు విష్ణు ప్యానెల్‌లో ముందుగా ఉంటూ చక్రం తిప్పుతున్నాడనే, ఈ వివాదాలకు కారణం ఆయనే అనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రకాష్‌రాజ్ ప్యానెల్ వాళ్లు మొదట్నుంచి ఈ విషయాన్ని లేవనెత్తుతూ వస్తున్నారు. పైగా ఇటీవల ఎన్నికల సమయంలోనూ శివబాలాజీని హేమ కొరికిందనే విషయాన్ని పదే పదే మీడియా ముందు చెబుతూ, దాన్ని పెద్ద వివాదంగా మార్చారని కమెంట్లు వచ్చాయి.
అదే సమయంలో సోమవారం ఎన్నికల ఫలితాల సమయంలోనూ దాసరి స్థానం మోహన్‌బాబు భర్తీ చేయాలని, ఆ స్థాయి ఆయనకు ఉందని నరేష్ తెలిపారు. దీంతోపాటు `మా` ఎన్నికల ప్రచారం, ఓటింగ్ సమయంలోనూ బూతులు తిట్టారని ప్రకాష్‌రాజ్ ప్యానెల్ ఆరోపించింది. అంతేకాదు ఒక్కడి వాళ్ల ఇదంతా జరుగుతుందా? అని చిరంజీవి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రకాష్‌రాజ్ ప్యానెల్ సభ్యులు కూడా మంగళవారం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నరేష్ `మా` కమిటీలో ఇన్‌వాల్వ్ అవుతాడు, అన్ని కార్యక్రమాల్లో ఆయన భాగమవుతాడు. పనులు జరగవు, గొడవలవుతాయని తెలిపారు.
`మా` ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు సంక్షేమ కార్యక్రమాలకు తాము అడ్డు రాకూడదని, మంచు విష్ణు స్వేచ్ఛగా తాను చేయాలనుకున్న పనులు చేయాలని తెలిపారు. తాము ప్రశ్నిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని, అందుకే తప్పుకుంటున్నట్టు తెలిపారు. దీంతో ఇప్పుడు `మా`లో కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా నరేష్ టార్గెట్గా మాట్లాడారు. తాము కొత్త కార్యవర్గంలో ఉంటే ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నిస్తామని ఇది రచ్చకి దారి తీస్తుందని శ్రీకాంత్ అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తుంటే నరేష్ కూడా అందులో ఉంటాడని అర్థమవుతుంది. ఆయనకు మాకు సెట్ కాదన్నారు.
తమ వైపు అందరు ధైర్యవంతులే ఉన్నారని, ప్రశ్నించే క్రమంలో గొడవలు అవుతాయని, రచ్చ అవుతుందని, చేయాల్సిన కార్యక్రమాలు ఆగిపోతాయని తెలిపారు శ్రీకాంత్. ఈ సందర్భంగా తమ నిర్ణయం పట్ల సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు శ్రీకాంత్. అదే సమయంలో ప్రభాకర్ స్పందిస్తూ `మా` ఎలక్షన్లు, కౌంటింగ్ సమయంలో నరేష్, మోహన్‌బాబు లు పోటీలో ఉన్నట్టు, మంచు విష్ణు అసలు పోటీలో ఉన్నారా? అనే సందేహాలు కలిగాయన్నారు. మొత్తం నరేష్ ఇన్‌వాల్వ్ అయి అనేక వివాదాలకు కారణమయ్యాడని ఆరోపించారు.
related news: బెనర్జీని తిడుతుంటే నా రక్తం మరిగింది.. మనోజ్, విష్ణు లేకపోతే గొడవ మరోలా ఉండేది.. మోహన్‌బాబుపై ప్రభాకర్
మరోవైపు నటుడు సమీర్ మాట్లాడుతూ, విష్ణుపై నమ్మకం ఉందని, అది కూడా వాళ్ల వెనుకున్న ఓ వ్యక్తి వేలు పెట్టకపోతే జరుగుతాయన్నారు. ఆయన ఎవరో కాదు నరేష్ అని చెప్పారు. ఆయన వేలు పెడితే మళ్లీ లాస్ట్ టైమ్ లాగే జరుగుతుందని, మీరనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన జరగనివ్వరని, మీకు, ఆయనకు మధ్య ఏం జరుగుతుందో త్వరలో మీకే తెలుస్తుంది. మీరు కచ్చితంగా రియలైజ్ అవతారని తెలిపారు. ఆ చాణక్యుడు మీ వెనకాల ఉన్నంత కాలం మీరు జాగ్రత్తగా ఉండాల`ని తెలిపారు సమీర్.
`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఈ ఆదివారం( అక్టోబర్ 10) జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన ప్యానెల్ నుంచి మొత్తం 15 మంది విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారు. వీరిలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రెటరీగా ఉత్తేజ్ గెలుపొందారు. ఈసీ మెంబర్స్ గా సురేష్ కొండేటి, ప్రభాకర్, కౌశిక్, శివారెడ్డి, ప్రగతి వంటి వారున్నారు.
