Asianet News TeluguAsianet News Telugu

బెనర్జీని తిడుతుంటే నా రక్తం మరిగింది.. మనోజ్‌, విష్ణు లేకపోతే గొడవ మరోలా ఉండేది.. మోహన్‌బాబుపై ప్రభాకర్‌

 నటుడు ప్రభాకర్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓట్లు ఎలా తారుమారయ్యాయి, కౌంటింగ్‌లో జరిగిన గోల్‌మాల్‌ గురించి వెల్లడించారు. అధ్యక్షుడు, మిగిలిన మూడు నాలుగు పోస్ట్ ల ఫలితాలు వెల్లడించి కౌంటింగా ఆపేశారని, వాయిదా వేశారని తెలిపారు.

prabhakar hot comments on mohanbabu in maa election counting issue
Author
Hyderabad, First Published Oct 12, 2021, 6:47 PM IST

`మా` ఎన్నికల వేడీ ఇప్పుడు మరింత హీటెక్కిస్తుంది. ఎలక్షన్లతో వివాదాలు సర్దుమనుగుతాయని అంతా భావించారు. కానీ అసలు గేమ్‌, అసలు రాజకీయాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయని తాజాగా `మా`లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి 11 మంది గెలుపొందారు. కానీ విష్ణు అధ్యక్షుడిగా కమిటీలో తాము ఉండలేమని, విష్ణు ప్యానెల్‌ బాగా వర్క్ చేయాలని, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు రాకూడదని తాము రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం సాయంత్రం ఎఫ్‌ఎన్‌సీసీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు తెలిపారు. ఈ మేరకు వాళ్లు రాజీనామా ప్రకటించారు.

ఈ సందర్భంగా నటుడు ప్రభాకర్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓట్లు ఎలా తారుమారయ్యాయి, maa election కౌంటింగ్‌లో జరిగిన గోల్‌మాల్‌ గురించి వెల్లడించారు. అధ్యక్షుడు, మిగిలిన మూడు నాలుగు పోస్ట్ ల ఫలితాలు వెల్లడించి కౌంటింగా ఆపేశారని, వాయిదా వేశారని తెలిపారు. సగం రిజల్ట్ చెప్పి ఆపడమనేది ఏ ఎన్నికల చరిత్రలోనూ జరగలేదన్నారు. prakash raj ప్యానెల్‌కి మెజారిటీ వస్తుందని భావించి కౌంటింగ్‌ని ఆపేశారని తెలిపింది. దీంతో అందరు వెళ్లిపోయారని, తాను మాత్రం అక్కడే ఉన్నానని, ఈసీ అధికారులు బ్యాలెట్‌ పేపర్లు తీసుకుని వెళిపోయారు, అదేంటని ప్రశ్నిస్తే తమకి ఆ అధికారం ఉందన్నారు.

ఆ తర్వాత నెక్ట్స్ డే కౌంటింగ్‌ జరుగుతున్నప్పుడు ఏంటీ బ్యాలెట్‌ పేపర్లన్ని ఒకేలా ఉన్నాయంటే, అర్థగంటలో ఫిర్యాదు చేయాలనే కొత్త రూల్‌ పెట్టారని, srikanth, vishnu దీనిపై మాట్లాడుకున్నారు. ఈసీ మెంబర్లకి సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లు సరిగా లేవనే విషయం చెప్పబోతుంటే విష్ణు ఫైర్‌ అయ్యారన్నారు. ఆ సమయంలో తాను రియాక్ట్ అయితే పరువు పోతుందని సైలెంట్‌గా ఉన్నానని, దీనిపై ఫిర్యాదు చేస్తే కోర్ట్ కి వెళ్లాల్సి వస్తుందని, అది చాలా టైమ్‌ పడుతుందని ఈసీ అధికారులు చెప్పారు. దీంతో మళ్లీ ఆ వివాదం ఎందుకని కౌంటింగ్‌ని కొనసాగించామని తెలిపారు ప్రభాకర్‌.

అయితే కౌంటింగ్‌ సమయంలో mohanbabu.. బెనర్జీని తిడుతుంటే తన రక్తం మరిగిపోయిందని, అలాంటి బూతులు తన జీవితంలోనూ వినలేదని, బెనర్జీ ఓర్పుతో భరించారని తెలిపారు. అవతల పక్కన ఉన్న వ్యక్తి పెద్ద మనిషి అని, ఆయన్ని ఎదుర్కొనే శక్తి లేదన్నారు. ఇప్పటికే ఓసారి తనకు అనుభవం అయ్యిందని, ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోతామని, తమకి పిల్లలున్నారు. వాళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇవన్నీ వద్దనుకుని సైలెంట్‌గా ఉన్నామన్నారు. అంతగా తిడుతున్నా ఏం చేయలేకపోయామన్నారు. ఆయన తనకు తండ్రి లాంటి వారని, ఆయన్ని ఏం ఎదిరిస్తామన్నారు ప్రభాకర్‌.

related news: మోహన్‌బాబు అమ్మనా బూతులు తిట్టారు.. మంచు లక్ష్మీ, విష్ణులను ఎత్తుకుని తిరిగా.. బోరున విలపించిన బెనర్జీ

ఆ సమయంలో మంచు విష్ణు పోటీ చేస్తున్నట్టు లేదని, మోహన్‌బాబు, నరేష్‌లు పోటీలో ఉన్నట్టు అనిపించిందని, అంతగా హంగామా చేశారని తెలిపారు ప్రభాకర్‌. ఇంకా చెబుతూ, ఆ సమయంలో మంచు మనోజ్‌ ఓదార్చాడని, ఆయన లేకపోతే గొడవ మరో లేవల్‌లో ఉండదేది, ఇప్పటి వరకు జరిగిన ఇష్యూస్‌ జస్ట్ ఆఫ్ట్రాల్‌గా ఉండేవన్నారు. మంచు విష్ణు కూడా ఎంతో అండగా నిలిచాడని తెలిపారు. విష్ణు మంచి వ్యక్తి అని, ఆయన `మా`ని బాగా నడపగలరని తెలిపారు.

అయితే తమ వల్ల విష్ణు చేయాల్సిన కార్యక్రమాలకు అడ్డు తగిలే ఛాన్స్ ఉందన్నారు. దీంతో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని, అందుకే రాజీనామా చేస్తామన్నారు. అయితే మేం ఇలానే కొనసాగితే ప్రశ్నిస్తామని, తాను మగాడినని, ప్రశ్నించకుండా ఉండలేనని తెలిపారు. మా సభ్యులకు మంచి జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గెలిచిన సభ్యులు అపోజిషన్‌ తీసుకోవడం చరిత్రలో ఎక్కడా జరగలేదని, సభ్యుల సంక్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రభాకర్‌. ఈ సందర్భంగా తమకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios