మీడియా ఎందుకు ఇలా తయారైంది: శ్రీదివ్య

First Published 27, Feb 2018, 11:31 AM IST
SriDivya Fires on Media over sridevi Forensic Report
Highlights
  • నిన్న వీరంతా శ్రీదేవి మ్యామ్ గొప్పతనం గురించి చెప్పారు.
  • ప్రస్తుతం జరుగుతున్న ఈ దారుణాన్ని ఎందుకు ప్రసారం చేయడం లేదు
  • శ్రీదివ్య ప్రశ్నకు సమాధానం ఇచ్చే ధైర్యం మీడియాకు ఉందా?

అలనాటి హీరోయిన్ అందాల తార శ్రీదేవి మరణ వార్త అందరినీ కలచివేస్తూనే ఉంది. ఆమె మృతదేహం ఇంకా ఇండియాకు చేరలేదు. పంపేందుకు దుబాయ్ అధికారులు ఎప్పటికి పర్మిషన్ ఇస్తారో తెలియలేదు. ఇదే అభిమానులను కలచివేస్తుంటే.. మీడియా తీరు మరీ దారుణంగా ఉంది.

అంతలోనే అనుమానాస్పద మృతి అంటూ.. ఎవరికి తోచినట్లుగా వారు కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఆల్కహాల్ కారణంగా అంటూ.. బాత్ టబ్ లో మునిగిందంటూ.. ఆత్మహత్య అంటూ.. హత్య కోణం అంటూ ఎవరి వాదన వారు వినిపించేస్తున్నారు. అందులోనూ టీఆర్పీల కోసం పాకులాడే కొన్ని ఛానళ్ల తీరు మరీ దారుణంగా ఉంది. మీడియా ప్రవర్తన తీరుపై టాలీవుడ్ హీరోయిన్ శ్రీదివ్యకు విసుగు వచ్చేసినట్లుగా ఉంది. అందుకే మీడియాను నేరుగా ఆరోపించకుండానే.. కౌంటర్ వేసింది.

'నిన్న వీరంతా శ్రీదేవి మ్యామ్ గొప్పతనం గురించి చెప్పారు. ఇప్పుడు వీరంతా తప్పుల కోసం వెతుకుతున్నారు. మీడియా ఎందుకు ఇలా తయారైంది. అదే మీడియా.. ప్రస్తుతం జరుగుతున్న ఈ దారుణాన్ని ఎందుకు ప్రసారం చేయడం లేదు. ఏం.. ఈ పిల్లలు మనుషులు కాదా' అంటూ సిరియా ఉదంతంలో వర్ణనాతీతమైన బాధలు పడుతున్న చిన్నారుల వీడియోను పోస్ట్ చేసింది. మరి శ్రీదివ్య ప్రశ్నకు సమాధానం ఇచ్చే ధైర్యం మీడియాకు ఉందా?

loader