శ్రీదేవి మృతి చెంది దాదాపు నెల కావస్తున్నా ఆమె గురించి మీడియాలో ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. శ్రీదేవి ఎలా మరణించారనే విషయంలో క్లారిటీ లేకపోవడమే దీనికి కారణం. శ్రీదేవి దుబాయ్ హోటల్ లో మరణించారు. ఆమె బాత్ టబ్ లో పడి మృతి చెందడానికి గల స్పష్టమైన కారణాలు బయటకు రాకపోవడమే ఈ అనుమానాలకు కారణం. శ్రీదేవి మృతి తరువాత దుబాయ్ లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు కూడా అనుమానాలు రేకెత్తించాయి. ప్రముఖ జోతిష్యుడు ములుగు వరప్రసాద్ శ్రీదేవి మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

 

 శ్రీదేవి పరాయి దేశంలో సంచలన పరిస్థితుల మధ్య మృతి చెందారు. వెండి తెరపై అతిలోక సుందరిగా వెలుగు వెలిగిన శ్రీదేవి దుబాయ్ లో అనూహ్య పరిస్థితుల్లో బాత్ టబ్ లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి బాత్ టబ్ లో మృతి చెందడానికి కారణాలు, అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి స్పష్టంగా ఎవరికీ తెలియదు. శ్రీదేవి మృతికి సంబంధించిన పూర్తి వివరాలని ఆమె కుటుంబ సభ్యులు బహిర్గతం చేయలేదు. శ్రీదేవి మృతి తరువాత దుబాయ్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతిపై దుబాయ్ ప్రభుత్వం విచారం జరిపినట్లు, కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

శ్రీదేవి మృతి విషయంలో అభిమానులకు ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. అందువలనే ఇన్ని అనుమానాల కలుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో శ్రీదేవి ఆత్మ హత్య చేసుకున్నారా లేకా హత్య చేసారా అనే అనుమానాలు కూడా కలిగాయి. దుబాయ్ ఫోరెన్సిక్ నివేదికలో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పది మృతి చెందినట్లు తేల్చారు. దీనిపై కూడా అనుమానాలు కలిగాయి. శ్రీదేవి మృతి ప్రమాదం అని వారు ఎలా నిర్ధారణకు వచ్చారంటూ కూడా చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు.

 

ప్రముఖ రాజకీయ నాయకుడు ఆ సమయంలో శ్రీదేవి మృతి హత్యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతి విషయంలో దావూద్ ఇబ్రహీం హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

 

కాగా ఉగాది సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యుడు ములుగు వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీదేవి మృతి ముమ్మాటికీ హత్యే అని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవిని ఆమె సన్నిహితులే హత్య చేసారని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జ్యోతిషులు ప్రముఖుల గురించి చెప్పే విషయాలు మీడియాలో వార్తలుగా నిలుస్తుంటాయి. ములుగు వరప్రసాద్ శ్రీదేవి మృతితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి కూడా ప్రస్తావించారు. రజనీకాంత్ రాజకీయాల్లో అద్భుత విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు.