శ్రీదేవి హఠాన్మరణం తర్వాత అందరూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలోనే రజనీకాంత్... ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన సీన్‌ను సన్నిహితులతో పంచుకున్నారు. ఈ అందాల తార తమిళంలో 16 వయాతినలే మూవీలో చేశారు. అదే మన తెలుగులో 16 ఏళ్ల వయసు. తన అద్భుతమైన నటనతో శ్రీదేవి మంచి మార్కులే కొట్టేశారట. ఆమెకు జోడీగా రజనీకాంత్ నటించారు. ఈ సినిమాలో ఓ సీన్ గురించి తమిళ సూపర్ స్టార్ ప్రస్తావించారు. శ్రీదేవి ఓ సన్నివేశంలో రజనీపై ఉమ్మి వేయాల్సిన సందర్భం. అయితే ఈ సీన్ కోసం చాలా సమయం పట్టిందట. రీటేక్‌లు తీసుకున్నా... సీన్ పర్ఫెక్ట్‌గా రాలేదు. డైరెక్టర్ కూడా సంతృప్తి చెందలేదు.రజనీకాంత్ నేరుగా శ్రీదేవి దగ్గరకు వెళ్లారట... మీరు మందుకు వచ్చి నిజంగానే తన మొహం మీద ఉమ్ము వేయాలని చెప్పారట. దీంతో ఆమె షాకయ్యారట. మీరు అలా చేస్తేనే సీన్ పర్ఫెక్ట్‌గా వస్తుందన్నారట. అంటే సీన్ రియల్‌గా ఉండేందుకు వాళ్లెంత కష్టపడ్డారో ఈ సంఘటనతోనే తెలుస్తోంది. వాళ్ల కమిట్మెంట్ కూడా అర్థమవుతుంది. ఈ సినిమాలో చేసిన కమల్ కూడా శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీ విడుదల కాగానే ఫ్లాప్ అవుతుందన్నారు... కాని సూపర్ హిట్ అయ్యిందని చెప్పారట.