అందాల తార శ్రీదేవి డెత్ మిస్టరీ వెనుకున్న విషయాలేంటి. హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లుగా ప్రధమిక విచారణలో తేల్చిన దుబయ్ పోలీసులు తాజాగా శ్రీదేవికి డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ డెత్ సర్టిఫికెట్ లో శ్రీదేవి చనిపోయే ముందు ఆల్కహాల్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

కాగా శ్రీదేవి ప్రస్థుతం వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఈ ట్రీట్ మెంట్ లో భాగంగా ఆల్కహాల్ తీసుకోవటం చాలా డేంజర్. కానీ శ్రీదేవి వివాహానికి హాజరైన నేపథ్యంలో ఆల్కహాల్ తీసుకుంది. అనంతరం భర్త బోనీ కపూర్ తో కలిసి వివాహానంతరం హోటల్ రూమ్ కు వెళ్లింది. అక్కడే బాత్ టబ్ లో శవమై తేలింది.

 

వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ... ఆల్కహాల్ తీసుకోవటం వల్లనే రియాక్షన్ తో ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. వెయిట్ లాస్ పిల్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే చాలా ప్రమాదమని డాక్టర్లు వెల్లడించారు. అయితే.. శ్రీదేవి ఆ తప్పిదం చేయటం వల్లనే పరిస్థితి చేయిదాటిపోయిందని తెలుస్తోంది.

 

బాత్ రూమ్ లోకి వెళ్లినప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లటం వల్లనే టబ్ లో మునిగి చనిపోయిందని నివేదికలో దుబయి అధికారులు వెల్లడించారు. నేరపూరిత కుట్ర లేదని తెల్చిన యూఏఈ ఆరోగ్య శాఖ గుండెపోటు అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రాత్రి 10 గంటల తర్వాత ముంబైకి శ్రీదేవి పార్థివ దేహం చేరుకుంటుంది. అనంతరం రేపు అంత్య క్రియలు జరగనున్నాయి.