నుదుట సింధూరం, కళ్లకు కాటుక, పెదాలకు తాంబూలాన్ని మించిన ఎర్రటి లిప్ స్టిక్, మెడలో బంగారు లక్ష్మీదేవి హారం, కంచిపట్టు చీర.. ఇలా అతిలోక సుందరి శ్రీదేవి బతికున్నప్పుడు ఎంత అందగా ముస్తాబయ్యేదో.. అంతే అందంగా తన భౌతిక కాయాన్ని అలంకరించి కడసారి వీడ్కోలుకు ముస్తాబు చేశారు కుటుంబ సభ్యులు.

 

రాత్రి ఇంటికి చేరుకున్న శ్రీదేవిని కడసారి చూపు చూసుకున్న కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్, ఇతర కుటుంబసభ్యులు అందంగా ముస్తాబు చేశారు. సెలెబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో సందర్శకుల కోసం వుంచి ఆ తర్వాత తెల్లని పూలతో అందంగా అలంకరించిన వాహనంలో... అంతిమయాత్రకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్ర ప్రారంభించారు. తెల్లరంగు మల్లెలను అంతిమయాత్ర రథం విలా పార్లే హిందూ హిందూ స్మశానవాటికకు చేరుకుంది.

 

అధికారిక లాంఛనలాతో ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీదేవి భౌతిక కాయంపై త్రివర్ణ పతాకంపై వుంచి సైనిక వందనం చేసారు. అనంతరం గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు.. బాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన అనేకమంది అగ్ర తారలు ముంబై వచ్చారు.

నిండు ముత్తయిదువులా శ్రీదేవిని అలంకరించి... విల్లే పార్లే హిందూ స్మశాన వాటికలో ఆమెకు వీడ్కోలు పలికారు.