శ్రీదేవిని ప్లాన్ ప్రకారం.. చంపేశారు.

Sridevi Death Controversy: Superstar’s death a planned murder, claims retired ACP of Delhi Police
Highlights

శ్రీదేవిది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ హత్యే

అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి మరణం వెనక ఉన్న అపోహలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని తొలుత దుబాయ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించగా బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు తేలింది.

అయితే శ్రీదేవి మృతిపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా గతంలో కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె మృతి విషయంలో తాము కలగజేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో దిల్లీకి చెందిన వేద్‌ భూషణ్‌ అనే మాజీ ఏసీపీ శ్రీదేవిని పథకం ప్రకారం హత్య చేశారని వ్యాఖ్యనించడం వివాదాస్పదంగా మారింది. పదవీ విరమణ పొందాక భూషణ్‌ దిల్లీలో ఓ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్నారు.

‘బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువు. అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదు. ఆమెను పథకం ప్రకారం చంపేశారని నాకు అనిపిస్తోంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు భూషణ్‌. దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఏమంటారో వేచి చూడాలి.

loader