Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి మృతి కేసులో బోనీకి షాకిచ్చిన దుబయ్ ప్రాసిక్యూటర్

  • దుబయిలో శ్రీదేవి హఠాన్మరణం
  • గుండెపోటుకు అవకాశమే లేదు
  • ప్రమాదమని ఎలా నిర్థారించారన్న ప్రాసిక్యూటర్
sridevi death case new twist

అందాల తార శ్రీదేవి దుబయిలోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ గదిలో హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే దుబయి సర్కారు ఆరోగ్య శాఖ ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించిందని నివేదిక ఇచ్చింది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఆరోగ్యవంతమైన మహిళ టబ్ లో మునిగి చనిపోవటమేంటని, దాన్ని అధికారికంగా ఎలా నిర్థారించారని ప్రాసిక్యూషన్ వారు ప్రశ్నిస్తున్నారు.

 

ముందు గుండెపోటుతో చనిపోయిందంటూ చెప్పిన కుటుంబ సభ్యులు ఇప్పుడు రిపోర్టులో ఆల్కహాల్ వుందంటూ రావటం, టబ్ లో ప్రమాదవశాత్తు మునిగిపోయిందంటూ రిపోర్ట్ రావటం ఇలా... రకరకాల కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతుండటంతో కేసు విచారణ తీవ్రమైంది.

 

శ్రీదేవిది ప్రమాదమా... ఆత్మ హత్యా.. లేక కుట్ర కోణమా అనేది అర్థం కాని సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో విచారణ ముమ్మరమైంది. భారతీయ సినీ పరిశ్రమల వర్గాలను, దేశంలోని కోట్లాది మంది అభిమానులను తొలుస్తున్న శ్రీదేవి మృతి ప్రశ్న ఇప్పుడు ఇలా ట్విస్ట్ లు ఇస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. 

 

శ్రీదేవి మృతి కేసును సీరియస్ గా తీసుకున్న దుబయి ప్రాసిక్యూషన్ కేసు విచారణ ముమ్మరం చేసింది. విచారణ పూర్తయే వరకు బోనీ కపూర్ దుబయి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios